పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం లైగర్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం అన్ని భాషలలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.అయితే ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.
ఈ సినిమా ట్రైలర్ పై డైరెక్టర్ గీత కృష్ణ స్పందించారు.ఈ సందర్భంగా గీతాకృష్ణ మాట్లాడుతూ.విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమాలో పక్కింటి అబ్బాయిల ఉన్నాడు.అయితే ఈ సినిమా కోసం పూర్తిగా తన శరీరాకృతిని మార్చుకున్నారని తెలిపారు.
ఈ సినిమా నుంచి విడుదల చేసిన విజయ్ దేవరకొండ న్యూడ్ పిక్ పరమ అసహ్యంగా ఉందంటూ ఈయన కామెంట్ చేశారు.ఇలా న్యూడ్ పిక్ గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా గురించి ట్రైలర్ గురించి మాట్లాడుతూ పూరి జగన్నాథ్ సినిమాలోని హాలీవుడ్ సినిమాలకు కాఫీలా ఉంటాయని, లైగర్ సినిమాలో కూడా అన్ని సినిమాలలో కొన్ని కొన్ని పాత్రలను కలిపి సాంబార్ తయారు చేశారంటూ గీతాకృష్ణ ఈ సినిమా గురించి కామెంట్ చేశారు.ఇలా పూరి జగన్నాథ్ పలు సినిమాలలో క్యారెక్టర్ లను తీసుకువచ్చి ఈ సినిమాలో మిక్స్ చేశారంటూ ఈయన ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఏది ఏమైనా గీతాకృష్ణ ఈ మధ్యకాలంలో పలువురు హీరోలు,దర్శకులు గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.







