గూఢచారి 2 డైరెక్టర్ మార్పు కారణం అదేనా..?

అడివి శేష్ హీరోగా గూఢచారి 2 సినిమా నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

గూఢచారి స్పై థ్రిల్లర్ గా సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అడివి శేష్ గూఢచారి 2 చేస్తున్నారు.

ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.గూఢచారి 2 సినిమాకు డైరెక్టర్ గా రాహుల్ పాకాలని తీసుకున్నారు.

అసలైతే గూఢచారి సినిమాను శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేశారు.కానీ అతని ప్లేస్ లో ఇప్పుడు రాహుల్ పాకాలని ఫిక్స్ చేశారు.

అడివి శేష్ తో శశి కిరణ్ లాస్ట్ ఇయర్ మేజర్ సినిమా కూడా చేశరు.ఆ సినిమా టైం లోనే ఇద్ది మధ్య ఎక్కడో తేడాలు వచ్చాయన్న టాక్ వచ్చింది.

Advertisement

మరి ఆ కారణం వల్లే గూఢచారి 2 నుంచి శశి కిరణ్ తప్పుకున్నాడా లేక గూఢచారి 2 కి ముందే డైరెక్టర్ గా రాహుల్ ని అనుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.గూఢచారి 2 సినిమాను అడివి శేష్ కెరీర్ లో బిగ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

 అడివి శేష్ కథ అందిస్తున్న ఈ జి 2 కూడా అతని ముందు సినిమాల రేంజ్ లో ఉంటాయని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు