డైరెక్టర్ తో ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి నిజమే.. కల్పికపై పరువు నష్టం దావా?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి, హీరోయిన్ ధన్య బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో ఈమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Director Balaji Mohan Confirms Marriage Actor Dhanya Balakrishna , Balaji Mohan,-TeluguStop.com

కేవలం వెండితెరపై సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పిస్తోంది ఈ ముద్దుగుమ్మ.కాగా ఈమె తెలుగులో 7th సెన్స్‌, నేను శైలజ, జయ జానకి నాయక వంటి సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

అలాగే ఇటీవల ధన్య బాలకృష్ణ వెబ్‌ సిరీస్‌లో సైతం నటించింది.అల్లుడు గారు, లూసర్‌, రెక్కీ వంటి వెబ్‌ సిరీస్‌లో ఆమె హీరోయిన్‌గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ తమిళం మలయాళం సినిమాలలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది.ధన్యవాదాలు టాలీవుడ్ లో భారీగానే అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ధన్య బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో మారుమూగుతోంది.ఆమె పెళ్లి విడాకులకు సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తుండడంతో ఆ వార్తలు విన్న పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు అయితే ఆ వార్తలు నిజం అని నమ్మి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ధన్యవాదాలు బాలకృష్ణ డైరెక్టర్ ను వివాహం చేసుకుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

కాగా నటి ధన్య బాలకృష్ణకు వివాహం అయ్యింది అంటూ నటి కల్పికా గణేష్ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని కూడా చేసిన విషయం తెలిసిందే.కాగా తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు బాలాజీ మోహన్ ధ్రువీకరించారు.

Telugu Balaji Mohan, Kalpika Ganesh-Movie

ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు.అంతేకాకుండా కల్పిక గణేశ్ తనపై, తన భార్య ధన్య బాలకృష్ణ పై పరువు నష్టం కలిగించేలా యూట్యూబ్‌లో వీడియో విడుదల చేసిందని కోర్టుకు సమర్పించారు.తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని దర్శకుడు ఆరోపించాడు.కల్పికా గణేష్ చెప్పిన విధంగానే బాలాజీ మోహన్, ధన్య బాలకృష్ణ జనవరి 2020 నెలలో వివాహం.

కాగా బాలాజీ మోహన్ కు అది రెండవ వివాహం.అప్పటికే బాలాజీ మోహన్ కు అరుణ అనే అమ్మాయి తో పెళ్లి కూడా జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube