'ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి'' లైఫ్ లోనే స్పెషల్ : అనిల్ రావిపూడి

నందమూరి నటసింహం బాలకృష్ణ ( Actor Balakrishna )టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు.ఈయన అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”భగవంత్ కేసరి”( Bhagwant Kesari ).

 Director Anil Ravipudi Speech At Balayya Mass Mantra Launch Event , Director Ani-TeluguStop.com

ఈ సినిమా టైటిల్ ను నిన్ననే గ్రాండ్ గా అనౌన్స్ చేసారు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూట్ చాలా భాగం పూర్తి అయ్యింది.

బాలకృష్ణ జూన్ 10న తన పుట్టిన రోజును జరుపుకో నున్నారు అనే విషయం బాగా తెలుసు.ప్రతీ ఏడాది లానే ఈ ఏడాది కూడా బాలయ్య బర్త్ డే రోజు భారీ ట్రీట్ ను సిద్ధం చేసారు మేకర్స్.

ఇప్పటికే టైటిల్ ప్రకటించి హైప్ పెంచేయగా.రేపు బర్త్ డే రోజు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉండగా ఈయన మాస్ మంత్ర సాంగ్ ను బాలయ్య అభిమానులతో కలిసి అనిల్ రావిపూడి లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ( Anil Ravipudi )స్పీచ్ ఇచ్చారు.ఈయన మాట్లాడుతూ.బాలయ్య గారు నటించిన సినిమాలను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను.

తొలిసారిగా ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని.సెట్స్ లో బాలయ్య ప్రతీ ఒక్కరికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారని.

ఆయనతో వర్క్ చేసిన తర్వాత ఆయన మీద ఉన్న అభిమానం, గౌరవం ఇంకా పెరిగాయని తెలిపారు.

అలాగే భగవంత్ కేసరి సినిమా తన కెరీర్ లొంబే స్పెషల్ గా ఉంటుందని.ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి( The Journey of Bhagwant Kesari ) అనేది తనకు మాత్రమే కాకుండా బాలయ్య గారి ఫ్యాన్స్ కు కూడా ఎంతో స్పెషల్ గా నిలిచి పోతుంది అని రిలీజ్ తర్వాత తప్పకుండ ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది అనే ఆశను వ్యక్తం చేసారు అనిల్.మరి రేపు టీజర్ ఎలా ఉంటుందో.

ఎన్ని రికార్డులను బద్దలు చేస్తుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube