పూజా హెగ్డేతో ఓ రేంజ్ లో స్టెప్పులేసిన అనిల్ రావిపూడి.. హీరోలతో డైరెక్టర్ కుమ్మేశాడుగా!

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఎఫ్3.అయితే ఇది వరకే విడుదలయిన ఎఫ్2 సినిమా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి ఉన్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఎఫ్3 సినిమాతో దీక్ష కుల ముందుకు రాబోతున్నారు.ఇందులో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన విషయం తెలిసిందే.వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా బిజీగా ఉన్నారు.

 Director Anil Ravipudi Share F3 Movie Dance Video With Pooja Hegde And Varun Tej-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన మార్క్ ని కూడా చూపిస్తున్నాడు.రోజుకో క్రేజీ అప్‌డేట్‌తో దూసుకుపోతున్నారు.లైఫ్ అంటే ఇట్ట ఉండలా సాంగ్‌లో పూజా హెగ్డే, వరుణ్ తేజ్‌తో కలిసి స్టెప్పులేసి అదరగొట్టేసాడు మన దర్శకుడు అనిల్ రావిపూడి.అయితే ఆ సాంగ్ చూసిన తర్వాత కూడా ఎవరు తనను ఎవరూ గుర్తుపట్టలేదేమో అని.గుర్తుచేస్తూ వీడియో లింక్‌ను ఆయన ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు అనిల్ రావిపూడి.ఆ వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ మీరు కచ్చితంగా రైట్‌లో ఉన్న వరుణ్ తేజ్, పూజా హెగ్డేను మాత్రమే చూసుంటారు.

లెఫ్ట్‌లో మనం కూడా ఉన్నాం.అంటూ వీడియోను ట్వీట్టర్‌లో షేర్ చేశాడు.అంతే కాకుండా పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అని కూడా ట్వీట్ చేశాడు.బుట్ట బొమ్మ పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ సాంగ్‌‌కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

పూజాతో కలిసి వెంకటేశ్, వరుణ్ తేజ్‌ చిందులేశారు.బ్లాక్ బాస్టర్ మూవీ ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ ఎఫ్3 సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇకపోతే ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా టికెట్లు ధరలు కూడా పెంచట్లేదని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆయన ప్రకటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube