ఆ ఘటనతో ఇప్పటికీ నా భార్య నన్ను దెప్పి పొడుస్తుంది: అనిల్ రావిపూడి

డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలలో ఎంత ఫన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా ఆయన నిజ జీవితంలో కూడా చాలా ఫన్నీగా ఉంటారని తెలుస్తోంది.

 Director Anil Ravipudi Comment On His Wife , Anil Ravipudi, Tollywood, Comment,-TeluguStop.com

తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ఈ నెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న అనిల్ రావిపూడి తన కాలేజీ రోజుల గురించి గుర్తు చేసుకొని పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

అనిల్ రావిపూడి కాలేజీ చదువుతున్న రోజులలో తన భార్య భార్గవి కూడా అదే కాలేజీలో చదివిన విషయాన్ని ఇదివరకే పలుసార్లు వెల్లడించారు.అయితే కాలేజీ రోజుల్లో అనిల్ రావిపూడి తరచూ ఒక అమ్మాయికి సైట్ కొట్టేవాడని, అయితే ఆ అమ్మాయి మాత్రం తనకు పడలేదని తెలిపారు.

అయితే ఆ అమ్మాయి క్లాస్మేట్ భార్గవి అని,ఈ విషయాన్ని అంతటినీ భార్గవి గమనిస్తూ ఉండేదని అని తెలిపారు.

Telugu Anil Ravipudi, Telugu, Tollywood, Bhargavi-Movie

ఇలా అనుకోకుండా చివరికి తాను భార్గవిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పటికీ కాలేజీ రోజుల్లో జరిగిన ఈ సంఘటన గురించి గుర్తు చేసుకుని, నేను పక్కన ఉండగానే మరొక అమ్మాయికి సైట్ కొట్టేవాడు అంటూ తనని దెప్పి పొడుస్తుందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిల్ తన కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటన గురించి బయటపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube