వివాహమైన ఐదు సంవత్సరాలకు ప్రెగ్నెన్సీ.. బుల్లితెర నటి తీసుకున్న షాకింగ్ నిర్ణయమిదే!

ప్రముఖ బుల్లితెర నటీమణులలో ఒకరైన దీపికా కక్కర్( Dipika Kakkar ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.హిందీ టీవీ సీరియళ్ల ద్వారా ఆమె ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు.

 Dipika Kakkar Shocking Post Goes Viral In Social Media Details, Dipika Kakkar, D-TeluguStop.com

ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న ఈ నటి పెళ్లైన ఐదు సంవత్సరాల తర్వాత గర్భవతి( Pregnant ) కావడంతో యాక్టింగ్ కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.నటనకు తాను గుడ్ బై చెబుతున్నానని ఈ నటి షాకింగ్ ప్రకటన చేశారు.

యాక్టింగ్ కు దీపికా కక్కర్ గుడ్ బై చెప్పడం గురించి ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.ప్రస్తుతం నేను ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

తల్లి కాబోతున్నాననే భావన ఎంతో బాగుందని దీపికా కక్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.పెళ్లైన ఐదు సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడంతో ఆ ఉత్సాహం వేరే లెవెల్ లో ఉందని దీపికా కక్కర్ చెప్పుకొచ్చారు.

Telugu Actressdipika, Bollywood, Dipika Kakkar, Dipikakakkar, Sasuralsimar, Seri

తక్కువ వయస్సులోనే నేను కెమెరా ముందుకు వచ్చి మేకప్ వేసుకోవడం మొదలుపెట్టానని దీపిక అన్నారు.దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఈ ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగించానని ఆమె కామెంట్లు చేశారు.నా ప్రెగ్నెన్సీ ప్రయాణం మొదలైన వెంటనే నాకు పని చేయడం ఏ మాత్రం ఇష్టం లేదని షోయబ్ కు( Shoaib ) చెప్పేశానని దీపికా కక్కర్ అన్నారు.ఇకపై గృహిణిగా తల్లిగా కెరీర్ ను కొనసాగించాలని ఫిక్స్ అయ్యానని ఆమె తెలిపారు.

Telugu Actressdipika, Bollywood, Dipika Kakkar, Dipikakakkar, Sasuralsimar, Seri

దీపికా కక్కర్ చేసిన కామెంట్లు ఒకవైపు సంతోషాన్ని మరోవైపు బాధను కలిగిస్తున్నాయని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.దీపికా కక్కర్ కు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు.సోషల్ మీడియాలో కూడా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.మరికొన్ని సంవత్సరాల తర్వాత దీపికా కక్కర్ రీఎంట్రీ ఇవ్వాలని కొంతమంది కామెంట్లు చేసున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube