దినేష్ తేజ్(Dinesh Tej) , హెబ్బా పటేల్(Hebah Patel) , పాయల్ రాధాకృష్ణ(Payal Radha Krishna) హీరో హీరోయిన్లుగా మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అలా నిన్ను చేరి(Ala Ninnu Cheri) .విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మలపాటి శ్రీధర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
సుభాష్ ఆనంద్ సంగీతం అందించినటువంటి ఈ సినిమా నేడు (నవంబర్ 10వ తేదీ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించింది ఏంటి అనే విషయాన్ని వస్తే…
కథ:
వెంకటాపురం అనే గ్రామంలో గణేష్(దినేష్ తేజ్)( Ganesh ) తన స్నేహితులతో కలిసి కాలేజ్ అంటూ జాలీగా తిరుగుతూ ఉంటారు.అయితే ఈయనకు చదువుపై ఆసక్తి కన్నా డైరెక్టర్ అవ్వాలని కోరిక ఎక్కువగా ఉండేది ఎలాగైనా సిటీకి వచ్చి సినిమాలలో డైరెక్టర్గా స్థిరపడాలనేదే తన కోరిక.
తన లక్ష్యం వైపు అడుగులు వేస్తుండగా అనుకోకుండా తన జీవితంలోకి దివ్య (పాయల్ రాధాకృష్ణ)( Divya ) వస్తుంది.ఈ ప్రేమ విషయం దివ్య తల్లి కంచు కనకమ్మ (ఝాన్సీ) కి( Kanchu Kanakamma ) తెలియడంతో దివ్యను తన బావ కాళీ (శత్రు) కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది.
దీంతో దివ్య గణేష్ దగ్గరకు వెళ్ళిపోతుంది.ఆ క్షణంలో ఆయన ప్రేమ వైపు అడుగులు వేయాల లేక లక్ష్యం వైపు అడుగులు వేయాల అన్న ఆలోచనలో ఉంటారు.
గణేష్ జీవితంలోకి అను (హెబ్బా పటేల్) వస్తుంది.అసలు అను తన జీవితంలోకి ఎలా వచ్చింది?దివ్య ఏమైంది? చివరికి గణేష్ డైరెక్టర్ అయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
దినేష్ తేజ్ పక్కింటి కుర్రాడు అనిపించేలా ఎంతో చక్కగా ఈ సినిమాలో నటించారు.ఎమోషనల్ సన్నివేశాలలో అందరిని ఆకట్టుకున్నారు.అలాగే యాక్షన్ సన్ని వేషాలలో కూడా నటించి అందరిని మెప్పించారు.ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం పాయాల్ సందడి చేయగా, సెకండ్ హాఫ్ మొత్తం హెబ్బా పటేల్ సందడి చేశారు.
ఇక వీరిద్దరూ కూడా వారి పాత్రలకు సరైన న్యాయం చేశారు.ఇక ఝాన్సీ( Jhansi ) ఇతర తారాగణం కూడా వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారని చెప్పాలి.
టెక్నికల్:
సినిమాలోని డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇక డైరెక్టర్ కూడా సినిమాని ఒకవైపు ప్రేమ కథ( Love Story ) గురించి అలాగే మరోవైపు లక్ష్యం గుర్తు చేస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.పాటలు కూడా పరవాలేదు అనిపించాయి.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది అయితే సినిమా నిడివి కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి.సినిమా మొత్తం నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
విశ్లేషణ:
సినిమా అంటేనే తప్పకుండా ప్రేమ అనేది తప్పనిసరిగా ఉంటుంది.ఈ సినిమాలో కూడా ప్రేమ కథ సన్నివేశాలను ఆధారంగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇలా ప్రేమ సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ ఈ సినిమా ఒకవైపు ప్రేమ మరొకవైపు లక్ష్యం అంటూ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ప్లస్ పాయింట్స్:
హీరో హీరోయిన్ల నటన, కథ, ఎక్కడ బోర్ కొట్టని సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కాస్త సాగదీత, ఎడిటింగ్.
బాటమ్ లైన్:
ఇలాంటి ప్రేమ కథ సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా సరికొత్త ఫీల్ అందిస్తుంది.