కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పిన దినేష్ కార్తీక్ .. కేకేఆర్ కొత్త కెప్టెన్ ఎవరంటే ?  

ipl , ipl2020, kkr, dinesh kartik, england, Ian Morgan - Telugu Dinesh Kartik, England, Ian Morgan, Ipl, Ipl2020, Kkr

ఐపీఎల్ 2020 లో మరో సంచలనం.కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ మారబోతున్నాడు.

TeluguStop.com - Dinesh Karthik Says Goodbye To Captaincy Who Is The New Captain Of Kkr

దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ పగ్గాలను ఇయాన్ మోర్గాన్‌ కు అప్పగించనున్నాడు.తన బ్యాటింగ్‌ పై ఫోకస్ పెట్టడం కోసం కార్తీక్ కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ మేరకు కోల్‌కతా మేనేజ్‌మెంట్‌ కు సమాచారం అందించాడు.నాయకత్వ బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌ కు అప్పగించాలని కార్తీక్ ఫ్రాంచైజీని కోరాడు.

TeluguStop.com - కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పిన దినేష్ కార్తీక్ .. కేకేఆర్ కొత్త కెప్టెన్ ఎవరంటే -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ముంబైతో మ్యాచ్‌ కు కొద్ది గంటల ముందు కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ పై విమర్శలు వెల్లువెత్తాయి.

జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు, నరైన్ ‌కు ఓపెనర్‌గా పదే పదే అవకాశాలు ఇవ్వడం.తన బ్యాటింగ్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో.ఫ్యాన్స్ కార్తీక్‌ ను కెప్టెన్సీ వదులుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు ఇంగ్లాండ్‌‌ కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌ ను జట్టులో ఉంచుకొని కార్తీక్‌ కు కెప్టెన్సీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

కానీ మేనేజ్‌మెంట్ మాత్రం కార్తీక్‌పైనే నమ్మకం ఉంచింది.కోల్‌కతా విజయాల బాట పట్టాక.కీలకమైన ప్లేఆఫ్స్ దశకు ముందు దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.దినేశ్ కార్తీక్ నిర్ణయం పట్ల కోల్‌కతా నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూరు స్పందించారు.

డీకే లాంటి నాయకుడు తమ జట్టులో ఉండటం అదృష్టమన్నారు.ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం అవసరమన్నారు.

ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ బాధ్యతలు అంగీకరించాడన్నారు.

.

#England #IPL2020 #Dinesh Kartik #Ian Morgan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dinesh Karthik Says Goodbye To Captaincy Who Is The New Captain Of Kkr Related Telugu News,Photos/Pics,Images..