క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకున్న గద్దలకొండ ఐటెం భామ

హీరోయిన్ డింపుల్ హయాతి అంటే ఎవ్వరికి పెద్దగా తెలియదు.కానీ గద్దలకొండ ఐటెం భామ అంటే వెంటనే గుర్తుపడతారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐటెం సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన నటి డింపుల్ హయాతి.బేసిక్ గా ఐటెం సాంగ్స్ అనగానే ఎవరో ముంబై మోడల్ అని అనుకుంటారు.

కానీ డింపుల్ అచ్చ తెలుగు హైదరాబాదీ అమ్మాయి.ఇప్పటికే మోడలింగ్ లో అడుగుపెట్టి సినిమాల వైపు వచ్చిన ఈ భామ ముందుగా ఓ చిన్న సినిమాలో హీరోయిన్ గా చేసింది.

అయితే ఆ సినిమాతో రాని గుర్తింపు గద్దలకొండ గణేష్ తో ఐటెం సాంగ్ తో సొంతం చేసుకుంది.ఆ సినిమా ఫేమ్ తీసుకొచ్చిన హీరోయిన్ గా అవకాశాలు మాత్రం దక్కడం లేదని అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ఓ క్రేజీ ఆఫర్ అమ్మడు చేతికి చిక్కింది.

Advertisement

ఓ విధంగా చెప్పాలంటే ఈ ఒక్క అవకాశంతో డింపుల్ కెరియర్ టర్న్ అయిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.రవితేజ హీరో రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది.

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.

ఈ నేపధ్యంలో సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉంటుంది.ఇందులో హీరోయిన్స్ గా చాలా మంది పేర్లు పరిశీలించిన మీదట తెలుగు అమ్మాయిలని తీసుకోవాలని దర్శకుడు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

దీంతో ఇప్పుడు రవితేజతో జోడీ కట్టే అవకాశాన్ని ఇద్దరు అచ్చ తెలుగు హీరోయిన్స్ కి దక్కింది.అందులో పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వర్మ ఒక హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ గా గడ్డలకొండ గణేష్ తో ఐటెం భామగా గుర్తింపు తెచ్చుకున్న డింపుల్ హయాతీని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని బోగట్టా.

Advertisement

తాజా వార్తలు