Dimple Hayati : డింపుల్ హయతి..15 రోజుల్లో మూడు చలాన్లు.. ఐపీఎస్ అయితే ఈ తప్పులు చేయచ్చా ?

డింపుల్ హయతి( Dimple Hayati ).రామబాణం( Rambanam ) సినిమా తో తెలుగు లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆమె నటిస్తున్న సినిమాల తో రాని క్రేజ్ ఇప్పుడు ఒక్క కేసు విషయం లో ఆమెకు దక్కింది.అసలు ఆ కేసు ఏంటి, ఆమెకు అంత కోపం ఎందుకు వచ్చింది, తెరవెనక ఏం జరిగింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డింపుల్ హయతి తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తుంది.అయితే అదే ఫ్లాట్స్ లో ఉంటున్న డిసిపి రాహుల్ హెగ్డే( DCP Rahul Hegde ) డింపుల్ హయతి తన కారుని తన్నింది అంటూ కేసు నమోదు చేయడం తో ఈ వ్యవహారం మీడియా వరకు వచ్చింది.

అయితే ఈ విషయం లో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పబ్లిక్ ప్లేస్ లో ఉండాల్సిన కోన్స్, సిమెంట్ బ్రిక్స్ ఒక ప్రయివేట్ అపార్ట్మెంట్ లో ఇల్లీగల్ గా తేవడం పట్ల పలువురు మండిపడుతున్నారు.పైగా రెండు నెలలుగా డింపుల్ తో పలుమార్లు డిసిపి రాష్ గా మాట్లాడుతూ కావాలనే వేధిస్తున్నారు అంటూ డింపుల్ తరపు న్యాయవాది మీడియం ముందు చెప్పడం విశేషం.

Advertisement

ఆలా ఎన్ని సార్లు తన పార్కింగ్ లో ఎలాంటి కోన్స్ పెట్టద్దని చెప్పిన వినాపోవడం తో డింపుల్ వాటిని కాలితో తన్నారని అయన చెప్తున్నారు.డిసిపి స్థాయి వ్యక్తి ఒక అమ్మాయితో మాట్లాడాల్సిన పద్ధతీ ఇదేనా అంటూ అయన ప్రశ్నించారు.

పైగా ఆమె సైతం సదరు అధికారిపై కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తే నాలుగు గంటల పాటు స్టేషన్ లో కూర్చోపెట్టి కేసు నమోదు చేయకుండా పంపించారు అని తెలుస్తుంది.ఇది కాకుండా ఆమె పై కావాలనే అధిక మొత్తం లో చలానాలు కూడా విధించినట్టు తెలుస్తుంది.ఒక పదిహేను రోజుల వ్యవధి లో నాలుగు సార్లు డేంజరస్ డ్రైవింగ్( Dangerous driving ) అంటూ చలాన్స్ డింపుల్ కారు పై ఉండటం విశేషం.

ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఒక హీరోయిన్ అయినా కూడా పోలీసుల పవర్ ముందు తల వంచాల్సిందేనా అంటూ ఆమె అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం పై డింపుల్ సైతం తన సోషల్ మీడియాలో స్పందించింది.

పవర్ ఉంటె ఏదైనా చేయచ్చ, న్యాయపోరాటం చేయడానికే సిద్ధంగా ఉన్నానంటూ స్ప్రష్టం చేసారు.ఒక సెలబ్రిటీ విషయంలోనే ఇలా ఉంటె ఇక సామాన్య ప్రజల పరిస్థితీ చెప్పాల్సిన పని లేదు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు