వారసుడు సినిమా తో దిల్ రాజు కి లాభమా నష్టమా

టాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ దిల్ రాజు మొదటి సారి కోలీవుడ్ వెళ్లి అక్కడి సూపర్ స్టార్ విజయ్ తో భారీ బడ్జెట్ కేటాయించి వారిసు అనే సినిమా ని నిర్మించిన విషయం తెలిసిందే.

ఈ నెల 11వ తారీఖున వారిసు చిత్రం విడుదల అయింది.

తెలుగు లో ఆ సినిమా వారసుడు గా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తమిళనాడు లో సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ దక్కిందట.

అయినా కూడా తెలుగులో పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు అనేది వాస్తవం.

భారీ అంచనాల నడుమ అక్కడ విడుదల అయిన వారిసు సినిమా కలెక్షన్స్ విషయం లో దూసుకు పోతుంది.విజయ్ సినిమా అంటే మినిమం 100 కోట్ల కలెక్షన్స్ అన్నట్లుగా నమోదు అవుతూ ఉంటాయి.కనుక వారిసు సినిమాకు కూడా 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదయ్యాయి.

Advertisement

కానీ దిల్ రాజు ఈ సినిమా కు ఖర్చు పెట్టిన డబ్బుతో పోలిస్తే ఇప్పటికి వచ్చిన డబ్బులు చాలా తక్కువ అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన వారిసు సినిమా అన్ని బిజినెస్ లెక్కలు తేల్చిన తర్వాత 200 కోట్ల రూపాయల వరకు దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది అని ప్రచారం జరుగుతుంది.ఆ విషయమై ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ అనేది లేదు, భారీ బ్లాక్ బస్టర్ సినిమా ఇంకా తెలుగు లో వారసుడు నిలిస్తే భారీ వసూళ్లు నమోదు చేస్తే అప్పుడు దిల్ రాజుకి లాభాల పంట దక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వారసుడు సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ నమోదు అవుతుందా లేదా అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఎలాగైనా తమిళం లో ప్రయోగం చేయాలనుకున్న దిల్ రాజు కు ఇది ఒక గుణ పాఠం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అధికారికంగా దిల్‌ రాజు వారి కాంపౌండ్ నుండి లాభమా నష్టమా అనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు