NBK108 లో భాగం కానున్న ప్రముఖ నిర్మాత.. ఎవరా నిర్మాత.. ఏంటా కథ?

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా విజయం తర్వాత మరొక మాస్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు.క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.

 Dil Raju To Join Balakrishna Anil Ravipudis Project-TeluguStop.com

 ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.

నిన్న బాలయ్య తన పుట్టిన రోజును జరుపు కున్నారు.ఈ సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

ఇందులో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేసాయి.టీజర్ చూస్తుంటే ఈ సినిమా పులిచర్ల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా అనిపిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

ఇటీవలే అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 3’ సినిమా రిలీజ్ అయ్యింది.ఇది కూడా ఈయన మార్క్ కు తగ్గట్టుగా ఉండడంతో హిట్ అయ్యింది.

ఇక ఇప్పుడు అనిల్ బాలయ్య సినిమాపై ఫోకస్ పెట్టాడు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించనున్నారని కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుందని.హీరోయిన్ గా ప్రియమణి అని వార్తలు వస్తున్నాయి.

Telugu Anil Ravipudi, Balakrishna, Dil Raju, Dilraju, Nbk, Shruti Haasan-Movie

ఇది పక్కన పెడితే నిన్న బర్త్ డే సందర్భంగా బాలయ్య 108వ సినిమాను అనిల్ చేయబోతున్నట్టు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.అయితే నిర్మాతలు ఎవరు అనేది ఏమీ చెప్పలేదు.ఇంతకు ముందు ఈ సినిమా సైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించ బడుతుంది అని వార్తలు వచ్చాయి.ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మరొక ప్రముఖ నిర్మాత యాడ్ అయినట్టు టాక్ బలంగా వినిపిస్తుంది.

ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు కూడా భాగం కానున్నాడని బాలయ్య 108 సినిమాకు దిల్ రాజు సహా నిర్మాతగా వ్యవహరించ బోతున్నారనే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.సైన్ స్క్రీన్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారట.

మరి దిల్ రాజు రాకతో బడ్జెట్ కూడా కాస్త పెరిగేలా ఉందని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube