దళపతి విజయ్ తో దిల్ రాజు నిర్మించిన వారిసు సినిమా తమిళంలో జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ వారసుడు కూడా ముందు జనవరి 11న రిలీజ్ చేయాలని అనుకోగా చిరు, బాలయ్య సినిమాలకు థియేటర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వారసుడు సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు.
ఈ రిలీజ్ వాయిదా వెనక దిల్ రాజు చెప్పిన కారణాలు కేవలం మన తెలుగు స్టార్స్ కు మొదటి రోజు ఎక్కువ థియేటర్లు కావాలనే ఉద్దేశంతోనే అని చెప్పుకొచ్చారు. కానీ అసలు మ్యాటర్ మాత్రం వేరే ఉందని టాక్.
దిల్ రాజుకి అటు మెగా కాంపౌండ్ నుంచి.ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి విపరీతమైన ప్రెజర్ వచ్చిందట.
వారసుడు సినిమా రిలీజ్ వాయిదా వేయమని చెప్పారట.అందుకే రెండు రోజుల ముందు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి తెలుగు రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
అయితే ఈ రెండు రోజులు దిల్ రాజు కూడా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు ఆడించి లాభాలు పొందే ఛాన్స్ ఉంది. సో అలా కూడా దిల్ రాజుకి ఈ పోస్ట్ పోన్ ప్లస్సే అని చెప్పొచ్చు.