బాలీవుడ్ లో స్టార్ హీరో గా బాలీవుడ్ బాద్షా గా పేరు సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) అనే చెప్పాలి… ప్రస్తుతం ఈయన అట్లీ డైరెక్షన్ లో జవాన్ అనే ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే పాన్ ఇండియా స్థాయి లో రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వసూళ్లపరంగా కూడా ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లను రాబట్టిన ఇండియన్ సినిమాగా పఠాన్ నిలిచింది.దీంతో పాన్ ఇండియా స్థాయిలో షారుక్ త్వరలోనే ‘ జవాన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇది కూడా పఠాన్ రేంజ్ లో విడుదల అవ్వబోతుంది.అయితే ఈ సినిమా తెలుగు హక్కులు విషయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Dil raju ) రిస్క్ చేయబోతున్నట్లు తెలిస్తుంది…

ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి తెలుగు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోలు కూడా వివిధ భాషలలో తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు నేటివిటీ టచ్ చేస్తూ ‘ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ‘ సినిమా చేశాడు.
ఇది కథ పరంగా వర్కౌట్ కాక భారీ డిజాస్టర్ గా నిలిచింది.మరోవైపు షారుఖ్ ఖాన్ డైరెక్ట్ గా తమిళంలో జవాన్ సినిమా చేస్తున్నాడు.
త్వరలోనే ఇది విడుదల కాబోతుంది.ఈ సినిమాతో ఎలాగైనా సౌత్ మార్కెట్లో క్రేజ్ పొందాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు…

అలాగే ‘ జవాన్( Jawan ) ‘ సినిమాతో తెలుగులో మార్కెట్ అందుకోవాలని చూస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది.తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా హక్కులని కొనుగోలు చేశారని టాక్.
సాధారణంగా దిల్ రాజ్ అంటేనే ఎన్నో అంచనాలు వేసి సినిమాను కొనుగోలు చేస్తారనే టాక్ ఉంది.అయితే ఇంతవరకు షారుక్ కు తెలుగులో పెద్దగా సక్సెస్ ఏమీ లేదు.
కేవలం దర్శకుడు అట్లీ మీద నమ్మకంతోనే దిల్ రాజు తెలివిగా ఈ భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్నట్లు తెలిస్తుంది.ఏదేమైనా జవాన్ సినిమా పై దిల్ రాజు పెద్ద రిస్క్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి…ఇక ఈ సినిమా ని తెలుగులో దిల్ రాజు కనక కొంటే దీనికి నిజంగా మంచి పబ్లిసిటీ వస్తుంది.
అలాగే ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా పెరుగుతాయి…
.







