టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన వారసుడు సినిమా భారీ షాకిచ్చింది.వారసుడు తమిళ, తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే దిల్ రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.హీరో ప్రభాస్, దర్శకుడు వినాయక్ నన్ను చూసి యాటిట్యూడ్ ఎక్కువ అని అనుకున్నారని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
అయితే ప్రభాస్, వినాయక్ నాతో కలిసి పని చేసిన తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.నా రెండో భార్య వైఘారెడ్డి కూడా మొదట నాకు యాటిట్యూడ్ ఎక్కువ అని అనుకున్నారని అయితే ఆ తర్వాత నేను చాలా కూల్ పర్సన్ అని వైఘారెడ్డికి అర్థమైందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
భార్య చనిపోయిన తర్వాత వ్యక్తిగత జీవితానికి సంబంధించి స్ట్రగుల్ అయ్యానని దిల్ రాజు పేర్కొన్నారు.
నన్ను అర్థం చేసుకునే వాళ్లు లైఫ్ లో ఉంటే బాగుంటుందని భావించి రెండో పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.వారసుడు సినిమా కలెక్షన్లను సైతం దిల్ రాజు అధికారికంగా వెల్లడిస్తున్నారు.ఈ సినిమా ఫలితం గురించి ఆయన స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.
దిల్ రాజు జడ్జిమెంట్ తప్పుతోందని కొంతమంది కామెంట్లు చేశారు.దిల్ రాజు లెక్క వరుసగా తప్పుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఫ్యామిలీ సినిమాలు అంటే కొత్తగా ఉండాలని 30 సంవత్సరాల క్రితం సినిమాలను ఇప్పుడు మళ్లీ తీసి చూపిస్తే లాభం ఏంటని కొంతమంది చెబుతున్నారు.దిల్ రాజు ఎంతో గొప్పగా వారసుడు గురించి ప్రచారం చేయగా విజయ్ ఫ్యాన్స్ ను సైతం మెప్పించలేని విధంగా ఈ సినిమా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.