దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఐదు సినిమాలు సెట్స్ పైనే... అరుదైన ఘనత

టాలీవుడ్ లో స్టార్ నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి దిల్ రాజు.ప్లానింగ్, కమిట్మెంట్ ఉంటే సక్సెస్ దానికదే వస్తుందని నమ్మిన వ్యక్తిగా దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతి ఏడాది ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతగా ఉన్నారు.

 Dil Raju Busy With Shooting Of Five Films, Tollywood, Telugu Cinema, South Cinem-TeluguStop.com

అతని సినిమాల సక్సెస్ రేట్ కూడా ఎక్కువే.ప్రస్తుతం దిల్ రాజు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.

ఈ సందర్భంగా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులని పిలిచి పార్టీ ఇచ్చారు.ఇదిలా ఉంటే ఈ ఏడాది సినిమా షూటింగ్ లు పూర్తిగా బంద్ అయిపోయాయి.

ప్రేక్షకుల ముందుకి రావాల్సిన వకీల్ సాబ్ లాక్డౌన్ ఎఫెక్ట్ తో ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది.ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మాత్రం దిల్ రాజు బ్యానర్ నుంచి కచ్చితంగా ఓ అరడజను సినిమాలు అయితే రావడం పక్కా అని ఫిక్స్ అయిపొయింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు దిల్ రాజు తన కెరియర్ లో, తెలుగు ఇండస్ట్రీలో ఎన్నడూ లేని అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ దిల్ రాజు పట్టాలెక్కించారు.

ఈ రోజు ఏకంగా 5 సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాలను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

షూటింగ్ జరుపుకుంటున్న దిల్ రాజు సినిమాల్లో వకీల్ సాబ్, ఎఫ్3, థాంక్యూ, పాగల్, హుషారు ఫేమ్ దర్శకుడితో చేస్తున్న చిత్రాలు ఉన్నాయి.ఇందులో వకీల్ సాబ్, ఎఫ్3 భారీ బడ్జెట్ సినిమాలు కాగా, థాంక్యూ మినిమమ్ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఇక పాగల్, హుసారు ఫేమ్ దర్శకుడుతో చేస్తున్న సినిమాలో లోబడ్జెట్ లో తెరకెక్కుతూ ఉండటం విశేషం.ఈ ఐదు సినిమాలు వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.

మరో వైపు జెర్సీ రీమేక్ తో దిల్ రాజు వచ్చే ఏడాది బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube