శాకుంతలంతో ఆ సినిమాలను దెబ్బ కొడుతున్న దిల్ రాజు.. తప్పు చేస్తున్నారా?

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు సాధారణ సినీ అభిమానులకు చిరాకు తెప్పించే విధంగా ఉన్నాయి.సంక్రాంతికి దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వారసుడు మూవీ థియేటర్లలో విడుదలవుతోంది.

 Dil Raju Biggest Mistake About Release Dates Details Here Goes Viral In Social M-TeluguStop.com

అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడంలో ఎలాంటి తప్పు లేకపోయినా బాలయ్య, చిరంజీవి సినిమాలకు థియేటర్ల విషయంలో ఇబ్బందులు కలిగిస్తూ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సినిమాలతో ఇండస్ట్రీలో ఎదిగిన దిల్ రాజు ప్రస్తుతం తెలుగు సినిమాలకు అన్యాయం చేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నెల 18వ తేదీన శివరాత్రి పండుగ కాగా ఇప్పటికే పలు క్రేజీ సినిమాలు ఆ పండుగకు తమ సినిమాలను షెడ్యూల్ చేసుకున్నాయి.శాకుంతలం 17వ తేదీన రిలీజ్ అవుతుండటంతో ఆ తేదీకి రిలీజ్ కానున్న ఇతర సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో విశ్వక్ సేన్ కెరీర్ ఆశాజనకంగా లేదు.సినిమాలు యావరేజ్ గా నిలుస్తున్నా కెరీర్ భారీ స్థాయిలో పుంజుకోవడం లేదు.

ఫిబ్రవరి 17వ తేదీన ధమ్కీ సినిమాతో విశ్వక్ సేన్ లక్ ను పరీక్షించుకోనున్నారు.ధనుష్ వెంకీ అట్లూరి కాంబో మూవీ కూడా అదే తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాలతో పాటు శ్రీవిష్ణు వినరో భాగ్యము విష్ణు కథ మూవీ కూడా అదే రోజున షెడ్యూల్ అయింది.

పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా అదే రోజుకు షెడ్యూల్ అయ్యాయి.ఒకేరోజు సినిమాలు థియేటర్లలో విడుదల కావడం వల్ల అన్ని సినిమాలు నష్టపోతాయి.తన చేతిలో థియేటర్లు ఉండటం వల్ల దిల్ రాజు శాకుంతలంను అదే తేదీకి విడుదల చేస్తున్నారు.

దిల్ రాజు తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగు సినీ అభిమానులను ఎంతగానో హర్ట్ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube