భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు నూతన కలెక్టరేట్ ను ఆయన ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలోనే జిల్లా బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి.సీఎం పర్యటన సందర్భంగా నేతలు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అయితే ఫ్లెక్సీల ఏర్పాటు అంశంలోనే విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమైనట్లు తెలుస్తోంది.వనమా వర్సెస్ రేగా వర్గీయులు పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ కూడా సీఎంకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది.







