ప్రముఖ పీఆర్వోలలో ఒకరైన వినాయకరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా బాలేకపోతే బాలేదని రాస్తారని బాగున్నా బాలేదని క్రిటిక్స్ రాయడం జరగదని చెప్పుకొచ్చారు.సినిమాను కిల్ చేయాలనే ఆలోచన జర్నలిస్ట్ లకు ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.
జర్నలిస్టుల సంఖ్య పెరగడంతో యూనిటీ లేదని ఆయన అన్నారు.అప్పట్లో ఛానెల్స్, వెబ్ సైట్లు ఉండేవి కాదని ఆయన వెల్లడించారు.
శోభన్ బాబు జెంటిల్ మేన్ అని శోభన్ బాబు ఆయన తక్కువ ఆహారం తిని ఎదుటివాళ్లను మాత్రం ఎక్కువ ఆహారం తినాలని సూచిస్తారని చెప్పుకొచ్చారు.శోభన్ బాబు వ్యక్తులను గుర్తు పెట్టుకోవాలని పత్రికలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తన గురించి చెబుతూ రాఘవేంద్రరావుతో అన్నారని వినాయకరావు చెప్పుకొచ్చారు.
తాను జర్నలిస్ట్ గా మొదట పద్మాలయ స్టూడియోస్ కు వెళ్లానని వినాయకరావు పేర్కొన్నారు.

ఆ సమయంలో తాను జయమాలినిని ఇంటర్వ్యూ చేశానని ఆయన వెల్లడించారు.ఆ తర్వాత తాను సితారలో చేరానని ఆ సమయంలో రామోజీరావు గారికి కృష్ణ గారికి మధ్య గ్యాప్ ఉండేదని వినాయకరావు చెప్పుకొచ్చారు.కృష్ణగారికి సంబంధించిన కవరేజీలు ఉండేవి కాదని ఆయన అన్నారు.
మేము పద్మాలయకు వెళ్లేవాళ్లం కాదని కృష్ణగారిని కలిసేవాళ్లం కాదని ఆయన అన్నారు.

పచ్చని సంసారం సినిమా నుంచి కృష్ణ, రామోజీరావు మళ్లీ కలిసిపోయారని ఆయన చెప్పుకొచ్చారు.ఒక ఇంటర్వ్యూ విషయంలో తనకు రాజేంద్ర ప్రసాద్ కు మనస్పర్ధలు వచ్చాయని వినాయకరావు తెలిపారు.ఈనాడు అంటే ఒక రకంగా సామ్రాజ్యం అనేలా ఫీల్ అయ్యేవాళ్లమని వినాయకరావు వెల్లడించారు.
ఇప్పటికీ తనను సితార వినాయకరావు అనేవారని ఆయన అన్నారు.ఈనాడులో ఉన్న సమయంలో అద్భుతాలు చేశామని ఆయన పేర్కొన్నారు.
ఒక పత్రికలో ఉంటే ఆ విలువ వేరే విధంగా ఉంటుందని వినాయకరావు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.