టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంత మంచి పేరు, ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అక్కినేని నాగేశ్వరరావు నుండి అఖిల్( Akhil Akkineni ) వరకు అందరూ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటులుగా ముందుకు దూసుకుపోతున్నారు.
కానీ నాగచైతన్య, అఖిల్ మాత్రం స్టార్ హీరోలుగా పేరు సంపాదించుకోలేకపోతున్నారు.తండ్రికి, తాతకు తగ్గట్టుగా పేరు తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఈ ఫ్యామిలీ ఇప్పటివరకు తమ తమ వ్యక్తిగత విషయాలలో హాట్ టాపిక్ గా నిలిచింది.చాలావరకు వారి పెళ్లిల విషయంలోనే వార్తలలో నిలిచారు.
గతంలో నాగచైతన్య, అఖిల్ కూడా తమ పెళ్లిల విషయంలోనే వార్తలను నిలిచారు.నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకోగా సంవత్సరం కిందట విడాకులు తీసుకున్నాడు.
ఇక అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు.

అలా వీరి పెళ్లిల విషయంలో వీరు బాగా హాట్ టాపిక్ గా నిలిచారు.ఇదంతా పక్కన పెడితే మళ్లీ వీరి ఫ్యామిలీలో ఒక గొడవ జరుగుతుంది అని లోలోపల వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అది కూడా నాగచైతన్య, అఖిల్ మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తుంది.
నిజానికి నాగచైతన్య, అఖిల్ వేరు వేరు తల్లులకు పుట్టిన పిల్లలు.అయినా కూడా వీరిద్దరూ ఒకే తల్లికి పుట్టిన వారిలా కలిసిమెలిసి ఉండేది.

ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.చాలావరకు మంచిగా ఉండేవాళ్ళు.అయితే వీరి మధ్య గత కొన్ని రోజుల నుండి విభేదాలు వస్తున్నాయని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.కానీ అక్కినేని అభిమానులు మాత్రం ఇందులో నిజం లేదు అంటూ వాళ్లంతా కలిసి ఉన్నారు అంటూ ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా వీరిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని క్లారిటీ వచ్చింది.ఈరోజు అక్కినేని అఖిల్ పుట్టినరోజు.దీంతో ప్రతి ఒక్కరు ఆయనకు బర్త్ డే విష్ చేశారు.సోషల్ మీడియాలలో అఖిల్ ఫోటో పెట్టి విష్ చేశారు.
ఇక ఆయన అభిమానులు కూడా బర్త్డే విషెస్ చేశారు.వీరి ఫ్యామిలీపై కోపంగా ఉన్న సమంత కూడా అఖిల్ కు బర్త్డే విష్ చేయటం ఆశ్చర్యపరిచింది.
ఇలా ప్రతి ఒక్కరు విష్ చేయగా నాగచైతన్య( Naga Chaitanya ) మాత్రం విషెస్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు.అటు ఇన్స్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్లో కానీ ఎటువంటి పోస్ట్ షేర్ చేసినట్లు లేదు.
దీంతో అనుమానాలకు మరింత దారి తీసినట్లు కనిపిస్తుంది.నిజంగానే అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తున్నాయని.
అందుకే నాగచైతన్య కనీసం విష్ కూడా చేయలేదు అని తెలుస్తుంది.మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.
కొందరు మాత్రం సోషల్ మీడియాలో కాకుండా పర్సనల్ గా చెప్పొచ్చేమో అంటూ అనుమానాలను కొట్టి పారేస్తున్నారు.మరి దీని గురించి ఈ ఫ్యామిలీ ఏమని స్పందిస్తుందో చూడాలి.