సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందుతున్న దిల్ రాజు( Producer Dil Raju ) చేసిన సినిమాలన్నీ వరుసగా మంచి విజయాలను అందుకుంటున్నాయి.అయితే మొదట్లో ఈయన చేసిన దిల్, ఆర్య, భద్ర లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి.ఇక దిల్ రాజు సూపర్ సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఆయనకి స్క్రిప్ట్ మీద ఉన్న కమాండ్ అనే చెప్పాలి.
ఒక స్టోరీ వినగానే దాంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి అనేది ఈజీగా పసిగట్టగలుగుతాడు.అందువల్లే స్టార్ ప్రొడ్యూసర్( Star Producer ) గా ముందుకు దూసుకుపోతున్నాడు.
ఆయన జడ్జిమెంట్ వల్లే చాలా సినిమాలు మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కించడం వల్ల సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.ఇక మిగితా ప్రొడ్యూసర్స్, తనకి ఉన్న తేడా అదొక్కటే స్టోరీని బాగుంటే సినిమా ఈజీగా సక్సెస్ అవుతుందనే ఫార్ములాతో దిల్ రాజు ముందుకు దూసుకెళుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరో గా, శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్( Game Changer ) అనే సినిమా చేస్తున్నాడు.ఇది దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
కాబట్టి ఈ సినిమా మీద దిల్ రాజు భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో భారీ ప్రాఫిట్స్ రావడం తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ లని అందుకుంటుందని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాడు.మరి ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమా సూపర్ సక్సెస్ ని అందిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…
.