దాసరి కి, చిరంజీవి కి ఉన్న తేడా ఇదే !

చాలా రోజుల ఆ టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పెద్దగా ఉండేది ఎవరు అనే ప్రశ్న అందరూ బుర్రలను తొలుస్తుంది.

దాసరి మరణించాక ఆయన స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఎవరికి ఉంది అంటూ అనేకసార్లు డిస్కషన్ జరుగుతూనే ఉంది.

చాలామంది పేర్లు తెరపైకి వస్తున్న కచ్చితంగా సినిమా పరిశ్రమలో ఒక టీ బాయ్ నుంచి నిర్మాత వరకు అందరినీ హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఎవరికి ఉంది అనేదే పెద్ద ప్రశ్న.తమ్మారెడ్డి భరద్వాజ్, సి కళ్యాణ్, మోహన్ బాబు వంటి వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ కూడా తెలుగు సినిమా పరిశ్రమ ముక్తకంఠంతో చిరంజీవి పేరు అనేకసార్లు చెబుతూ వస్తోంది.

అయితే చిరంజీవి తనకు పెద్దగా ఉండడం ఇష్టం లేదు అనేది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.ఎందుకంటే వివాదాలకు దూరంగా ఉండాలని భావించే చిరంజీవి అందరివాడుగా ఉండాలని భావిస్తున్నారు.

ఒక్కసారి పెద్ద అనే పీఠంపై కూర్చుంటే కొందరికి చెందిన వాడిగా ముద్ర పడిపోతాను అనేది ఆయన మనసులో మాట.కార్మికుల సమస్యలకు పరిష్కారం చెప్పగలిగే వ్యక్తి మాత్రం చిరంజీవి అని పరిశ్రమ భావిస్తోంది.పైగా 150 సినిమాలు తీసిన వ్యక్తిగా ఆయనకు ఎంతో అనుభవం కూడా ఉంది.

Advertisement

అయితే ఇటీవల కొన్ని ప్రశ్నలు ఆయన పరిశ్రమకు పెద్దగా ఉండడం తనకు ఎంతో ప్రెషర్ తో కూడుకున్న విషయం అంటూ చెప్పుకొస్తున్నారు.అయితే కరోనా సమయంలో కానీ, అంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ ఆయన సమాజసేవ చేస్తూనే సినిమా పరిశ్రమకు, కార్మికులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది దాసరికి చిరంజీవికి ఉన్న అతిపెద్ద తేడా ఏంటంటే దాసరి చనిపోయే వరకు కూడా ఆయనను కలవడానికి ఎవరికైనా కూడా అవకాశం ఉండేది.ఈజీగా దాసరితో కలిసి ఎందుకు ఆయన కూడా ఒప్పుకునేవారు.కానీ చిరంజీవిని కలవాలంటే అది చాలా పెద్ద విషయం ఒక సినిమా కార్మికుడు చిరంజీవిని కలిసి ఎందుకు మధ్యలో చాలామందిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది.

ఇదే అతిపెద్ద సమస్య ఇప్పుడు.అందుకే దాసరికి చిరంజీవికి మధ్య ఈ వ్యత్యాసం కనిపిస్తోంది.చిరంజీవి సినిమా పెద్దగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరినీ కలవగలిగే పరిస్థితి రావాల్సిందే.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు