అతనికి పనిస్తే ఇలా చేస్తాడు అనుకోలేదు.. థమన్ కామెంట్స్ వైరల్!

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం సర్కారీ వారి పాట.

ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

అయితే ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్ విడుదల చేయడం కోసం చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఈ పాట లీక్ కావడంతో ఎంతో మంది ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ.మనసైతే చాలా బాధగా ఉంది సుమారు ఆరు నెలల పాటు ఈ సినిమా కోసం ఎంతో మంది కష్టపడ్డాము రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ పాట కోసం కష్టపడ్డాము.

ఈ పాట షూటింగ్ జరిగే సమయంలో ఏకంగా తొమ్మిది మంది కరోనా బారిన పడినప్పటికీ ఈ పాట కోసం చాలా కష్టపడి పనిచేశానని ఇలా విడుదల చేయడానికి అంటే ముందుగా హార్ట్ బ్రేకింగ్ గా ఉందని అని తెలియజేశారు.

ఈ విషయం తెలిసి బాధపడాలో లేదా ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా అర్థం కావడం లేదు.ఎంతో కష్టపడి పని చేసిన ఈ పాటను చాలా ఈజీగా నెట్ లో పెట్టారు.వాడికి పని ఇస్తే వాడు ఇలా చేస్తాడు అని అనుకోలేదు అంటూ ఈ పాట లీక్ పై స్పందిస్తూ ఎంతో బాధను వ్యక్తపరిచారు.

Advertisement

ఇక ఈ విషయాన్ని తమన్ పబ్లిక్‌ డొమైన్‌లో ఈ ఆడియో నోట్‌ పెడుతూ.పైరసీ అనేది ఎంత ఘోరమైన విషయమో ఆ వ్యక్తికి అర్థం కావాలనే ఉద్దేశ్యంతో ఇలా పెడుతున్నాను అంటూ తెలియజేశారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు