ఈ ఫ్లాప్ సినిమాలో రాజమౌళి నటించారనే విషయం మీకు తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఒకప్పుడు ఈయన బుల్లితెర సీరియల్స్ కు దర్శకుడిగా వ్యవహరించేవారు అనంతరం ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 Did You Know That Rajamouli Acted In This Flop Movie ,rajamouli, Rrr Movie, Rain-TeluguStop.com

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు పొందారు.

Telugu Baahubali, Prabhas, Rahulsonal, Rainbow, Rajamouli, Rrr, Number, Vn Adity

బాహుబలి సినిమా ఫాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో రాజమౌళి కీర్తి ప్రతిష్టలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పెరిగిపోయాయి.అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం RRR.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో రాజమౌళికి దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో అదే గుర్తింపు లభించింది.

Telugu Baahubali, Prabhas, Rahulsonal, Rainbow, Rajamouli, Rrr, Number, Vn Adity

ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆదరణ సంపాదించుకున్న రాజమౌళి సినిమాలలో కూడా నటించారనే విషయం చాలామందికి తెలియదు.ఇలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈయన తెలుగులో ఒక ఫ్లాప్ సినిమాలో నటించారు.మరి జక్కన్న నటించిన ఆ డిజాస్టర్ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే 2008లో విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రెయిన్‌బో’.ఇందులో రాహుల్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో దర్శకులు రాజమౌళి కోడి రామకృష్ణ చిన్న క్యామియో రోల్స్‌లో కనిపించారు.ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube