వినడానికి విచిత్రంగా వున్నా మీరు విన్నది అక్షరాలా నిజం.మానవ శరీరంలో అంతర్గతంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్స్, ఇతరత్రా జబ్బుల గురించి తెలుసుకునేందుకు స్కానింగ్, ఎండోస్కోపి లేదా ఎక్స్‌రే వంటి టెస్టులు చేస్తారనే విషయం అందరికీ తెలిసిన విషయమే.
కానీ ఇప్పుడు చర్మంపై బ్యాండ్-ఎయిడ్ అతికించినంత సులభంగా ఇంటర్నల్ బాడీని టెస్ట్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇటీవల MIT శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్తరకం బ్యాండ్ ఎయిడ్.గుండె, ఊపిరితిత్తులు సహా అంతర్గత అవయవాల అల్ట్రాసౌండ్ చిత్రాలను సులభంగా తీయగలదు.
అల్ట్రాసౌండ్ అనేది అంతర్గత శరీర అవయవాలు, కణజాలాలు సహా ఇతర నిర్మాణాల చిత్రాన్ని (సోనోగ్రామ్) రూపొందించేందుకు ధ్వని తరంగాలను ఉపయోగించే ఒక ఇమేజింగ్ టెస్ట్.ఇది ఎక్స్-కిరణాల మాదిరి ఎటువంటి రేడియేషన్ ఉపయోగించదు.
కానీ ఈ పరీక్ష కోసం భారీ సైజు గల ఖరీదైన పరికరాలను ఉపయోగిస్తున్నాం.ఇలాంటి డివైజెస్‌కు పరిష్కారంగా ఎంఐటీ శాస్త్రవేత్తలు.స్టాంప్ పరిమాణంలో ఉండే బ్యాండ్ ఎయిడ్ పరికరాన్ని రూపొందించారు.
48 గంటల పాటు చర్మానికి అంటుకునే సామర్థ్యం గల ఈ బ్యాండ్.అంతర్గత అవయవాలు, కణజాలానికి సంబంధించిన హై-రిజల్యూషన్ చిత్రాలను సులభంగానే కాక సరసమైన ధరలలో అందిస్తుంది.MIT బృందం అభివృద్ధి చేసిన ఈ పరికరం సన్నటి ఆకారంలో అంటుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది.
ధ్వని తరంగాలను ప్రసారం చేయగల ఘన, నీటి ఆధారిత జెల్‌తో తయారైన ఈ పరికరాన్ని చర్మానికి అటాచ్ చేసినపుడు జెల్ డీహైడ్రేట్ కాకుండా నిరోధిస్తుంది.దీని పనితీరును వలంటీర్లపై పరీక్షించగా.
పొట్ట, ప్రధాన రక్త నాళాలు వంటి చిన్న నిర్మాణాలను విజయవంతంగా చిత్రించగలిగింది.