బాలీవుడ్ యంగ్ బ్యూటీ లలో దిశా పటానీ ఒకరు.ఈమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
ప్రెసెంట్ ఈమె నటించిన ఏక్ విలన్ 2 సినిమా రిలీజ్ అయ్యింది.గత కొన్ని రోజులుగా దిశా ఈ సినిమా కోసం వరుస ప్రొమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేయడానికి తనవంతు కృషి చేస్తుంది.
జులై 29న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
ఇక ఇది ఇలా ఉండగా దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు దర్శనం ఇచ్చాయి.
జాతీయ మీడియా మాత్రమే కాకుండా స్థానిక మీడియాలు సైతం ఈ వార్తలను హైలెట్ చేయడంతో ఇదంతా నిజమే అని అందరు ఫిక్స్ అయ్యారు.ఈ లవ్ బర్డ్స్ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు.
అయితే వీరు బ్రేకప్ అయ్యారు అనే వార్త విన్న ఫ్యాన్స్ ఒకరకంగా హార్ట్ అయ్యారనే చెప్పాలి..
సోషల్ మీడియాలో ఈ జంటకు బాగా ఫాలోయింగ్ ఉండడంతో అందరు ఈ వార్తలపై ఆరా తీయడం మొదలు పెట్టారు.అయితే తాజాగా ఈ వార్తలకు టైగర్ ష్రాఫ్ చెక్ పెట్టాడు.

ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పని వీరిద్దరూ విడిపోలేదు అని సంకేతం ఇచ్చాడు.ఏక్ విలన్ ప్రోమోట్ చేయడంతో పాటు దిశా పటానీ ని ట్యాగ్ చేసాడు.ఈ పోస్ట్ చూసి వీరు బ్రేకప్ చెప్పుకోవడం అంతా అబద్ధం అని ఫిక్స్ అయ్యారు.ఈ పోస్ట్ తో టైగర్ ష్రాఫ్ తమ లవ్ కొనసాగుతూనే ఉంటుంది అని బ్రేకప్ వార్తలను ఖండించాడు.
ఇక దిశా ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఈమె పాత్ర గురించి క్లారిటీ అయితే రాలేదు కానీ.ఇప్పటికే ఈమె సెట్ లో జాయిన్ అయ్యి తన పార్ట్ పూర్తి చేసుకుంటుంది.







