రష్మిక విజయ్ దేవరకొండ ( Rashmika,Vijay Deverakonda ) గురించి సోషల్ మీడియాలో అనేకం ప్రేమ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.వీరిద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ కారణంగా వీరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అభిమానులు ఊహాగానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.
అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వీళ్లు తమ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని పరోక్షంగా బయటపెట్టారు.అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా జంటగా వెళ్లినప్పటికీ ఒంటరిగానే వెళ్లినట్లు చెప్పుకుంటూ వారికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారని నెటిజన్లు పసిగట్టారు.
అలాగే దీపావళికి రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పండగ చేసుకోవడం, అలాగే రష్మిక విజయ్ ల పేరెంట్స్ రెస్టారెంట్లో డిన్నర్ కి వెళ్లడం, ఈమధ్య ఓ సింగింగ్ షో కి గెస్ట్ గా వచ్చిన రష్మిక మా ఆంటీ మాధవి ( Madhavi ) అంటూ చెప్పుకు రావడం ఇలా ప్రతి ఒక్కటి వీరి మధ్య ప్రేమ నిజమని అనుకోవడానికి ఉదాహరణగా మారాయి.
అయితే తాజాగా విజయ్ దేవరకొండ గురించి మరొక వార్త చక్కర్లు కొడుతుంది.విజయ్ దేవరకొండ రష్మిక కంటే ముందే మరొక హీరోయిన్ ని ప్రేమించారని, కానీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో రష్మికతో ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు రీతూ వర్మ( Ritu varma ) .విజయ్ దేవరకొండ హీరోగా చేసిన మొదటి సినిమా పెళ్లిచూపులు.ఈ సినిమాలో హీరోయిన్గా రీతూ వర్మ చేసింది.
ఈ సినిమాకి నేషనల్ అవార్డు సైతం వచ్చింది.అయితే ఈ సినిమా సమయంలో వీరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి మీడియాలో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారు ప్రేమలో పడ్డారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ విజయ్ కి రీతూ మీద ప్రేమ ఉన్నప్పటికీ రీతూ వర్మ మాత్రం మరొక వ్యక్తి ప్రేమలో ఉండడం వల్ల విజయ్ ని రిజెక్ట్ చేసిందని, కానీ రీతూ వర్మ చేసిన సినిమాలు వరసగా ప్లాఫ్ అవడం వల్ల ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఆమెకు బ్రేకప్ చెప్పి మరో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.మరి ఇండస్ట్రీలో వినిపించే ఈ రూమర్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రష్మిక (Rashmika) కంటే ముందే విజయ్ దేవరకొండ రీతూ వర్మ ప్రేమలో పడ్డారనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.