వెంకటేష్ కి ఐశ్వర్య రాయ్ కి మధ్య ఇంత జరిగిందా..ఎవ్వరూ ఊహించలేదుగా!

మన టాలీవుడ్ లో ఎలాంటి ఈగో లేకుండా అందరితో ఎంతో కలివిడిగా ఉండే హీరోలలో ఒకడు విక్టరీ వెంకటేష్.లెజండరీ నిర్మాత డాక్టర్ డి.

 Did This Happen Between Venkatesh And Aishwarya Rai No One Expected It! Venkates-TeluguStop.com

రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన, పెద్ద కుటుంబం నుండి వచ్చాను అనే పొగరు ఏమాత్రం లేకుండా అసిస్టెంట్స్ దగ్గర నుండి కో ఆర్టిస్ట్స్ వరకు ప్రతీ ఒక్కరికీ ఎంతో మర్యాద ఇస్తాడు.అందుకే వెంకటేష్( Venkatesh ) అంటే అందరికీ అంత ఇష్టం.

హీరోయిన్స్ పట్ల కూడా ఆయన వ్యవహరించుకునే తీరు ఎంతో ప్రశంసనీయం.అలా డౌన్ టు ఎర్త్ ఉండే వెంకటేష్ కి కూడా కోపం రప్పించిన హీరోయిన్ ఒకరు ఉన్నారు అట.

Telugu Aishwarya Rai, Bollywood, Nagarjuna, Preity Zinta, Premante Idera, Tollyw

ఆమె మరెవరో కాదు ఐశ్వర్య రాయ్.ఈమె తెలుగు లో ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు, అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘రావోయి చందమామ‘ చిత్రం లో ఒకపాట లో కనిపిస్తుంది అంతే.అయితే గతం లో విక్టరీ వెంకటేష్ మరియు ప్రీతీ జింటా కాంబినేషన్ లో అప్పట్లో ‘ప్రేమంటే ఇదేరా( Premante Idera )’ అనే చిత్రం విడుదలై పెద్ద హిట్ అయ్యింది.ఈ సినిమాలో ప్రీతీ జింటా కంటే ముందుగా ఐశ్వర్య రాయ్ ని సంప్రదించారట.

ఈమె డేట్స్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలను పెట్టిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు.కాసేపు డేట్స్ ఇస్తాను అని చెప్పి, కాసేపు కేవలం ఈ డేట్స్ లో అయితేనే షూటింగ్ కి వస్తాను అని చెప్పి, ఇలా నిర్మాతలతో కబడ్డీ ఆడేసుకుందట.

Telugu Aishwarya Rai, Bollywood, Nagarjuna, Preity Zinta, Premante Idera, Tollyw

తీరా డేట్స్ ఇచ్చిన తర్వాత హోటల్ రూమ్ బుక్ చెయ్యడం దగ్గర నుండి, తన స్టాఫ్ ఖర్చుల వరకు అన్నీ నిర్మాతలే భరించాలి అని కండిషన్ పెట్టింది.అప్పట్లోనే ఈమె ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి కోటి రూపాయిలు డిమాండ్ చేసిందట.అందులో 50 లక్షల రూపాయిలు వెంటనే అడ్వాన్స్ ఇస్తేనే డేట్స్ ఇస్తాను అని షరతులు పెట్టిందట.నిర్మాత అన్నిటికీ ఒప్పుకున్నాడు, కానీ రొమాంటిక్ సన్నివేశాల్లో నేను నటించను, హీరో లొకేషన్ లో షూటింగ్ లేని సమయం లో నాకు చాలా దూరం గా ఉండాలి, ఇలాంటివన్నీ డిమాండ్ చేసిందట.

ఇదంతా తెలుసుకున్న వెంకటేష్ ఐశ్వర్య రాయ్ కి( Aishwarya Rai ) కాల్ చేసి గట్టిగా కోటింగ్ ఇచ్చినట్టు అప్పట్లో ఇండస్ట్రీ లో రూమర్స్ వచ్చాయి.ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో ఆమెకంటే పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ప్రీతి జింటా ని తీసుకున్నారు.

ఈమె ఐశ్వర్యారాయ్ కంటే తక్కువ రెమెంరేషన్ డిమాండ్ చేసి, ఆ చిత్రం చేసింది, అది కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో ఆమెకి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube