హీరోయిన్ సదా( Heroine Sada ) .ఈమె పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.
ఈమె జయం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోల సరసన అవకాశం అందుకుంది.అయితే ఈమె చేసిన సినిమాల్లో నాలుగైదు సినిమాలు తప్ప మిగతావన్నీ ప్లాఫే.
అలాగే మొదటి సినిమాతోనే స్టార్డం తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని అంతగా మార్చుకోలేకపోయింది.ఇక కొంతమంది హీరోయిన్లు మొదటి సినిమా హిట్ అయితే ఆ తర్వాత స్టార్స్ గా మారిపోతారు.
కానీ సదా కి ఆ అదృష్టం లేదు.మొదటి సినిమా హిట్ అయిన కూడా ఈమె సరైన కథలు ఎంచుకోలేక స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలను పోగొట్టుకుంది.
ఇక సీనియర్ నటి సదా ( Heroine Sada ) ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటూ అప్పుడప్పుడు సినిమాల్లో పలకరిస్తూ పోతుంది.

అయితే సదా స్టార్ హీరోయిన్ అవ్వడానికి ప్రధాన కారణం మరో నటి అని తెలుస్తోంది.ఆ నటి చనిపోవడం వల్లే సదా స్టార్ హీరోయిన్ అయిందట.మరి సదా స్టార్ హీరోయిన్ అవ్వడానికి ఏ నటి కారణమైందో ఇప్పుడు తెలుసుకుందాం.
నటి ప్రత్యూష ( Prathyusha ) అంటే ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు.అలాగే ప్రస్తుతం ఆమె మన ముందు లేదు.ఆమె చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.ప్రత్యూష మోహన్ బాబు హీరోగా చేసిన రాయుడు సినిమాలో( Rayudu ) ఆయన కూతురుగా చేసింది.
అలాగే శ్రీరాములయ్య ( Sri Ramulayya ) సినిమాలో పనిమనిషిగా చేసింది.అంతేకాకుండా ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన కలుసుకోవాలని అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.
అలాగే స్నేహమంటే ఇదేరా సినిమాలో నాగార్జున చెల్లెలిగా చేసింది.అలాంటి ప్రత్యూష చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
అయితే తేజ దర్శకత్వంలో వచ్చిన నితిన్ హీరోగా చేసిన జయం సినిమాలో హీరోయిన్ అవకాశం ముందుగా ప్రత్యూష కే వచ్చిందట.

అయితే ఈ సినిమాలో అవకాశం వచ్చిన కొద్ది రోజులకే ప్రత్యూష మరణించడంతో అందులో హీరోయిన్ గా సదాని తీసుకున్నారట.ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రత్యూష తల్లి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టింది.జయం ( Jayam ) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా నా కూతురికి అవకాశం వచ్చింది.
కానీ ఆ సినిమాలో చేసే సమయానికి నా కూతురు చనిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.అలా ప్రత్యుష చనిపోవడంతో సదా కి జయం సినిమాలో అవకాశం వచ్చి స్టార్ హీరోయిన్ గా మారింది.
ఇక పరోక్షంగా చెప్పుకోవాలంటే సదా కి స్టార్డం రావడానికి కారణం ప్రత్యూషనే.