మేజర్ బ్యూటీ శోభితా ధూళిపాల (Sobhita Dhulipala) కి మేజర్ సినిమా కంటే ఎక్కువగా నాగచైతన్యతో ఎఫై** ఉంది అనే వార్తల కారణంగానే ఎక్కువ ఫేమస్ అయ్యింది.మేజర్ (Major) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఎప్పుడైతే నాగచైతన్య తో కొన్ని ఫోటోలు దిగినట్టు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయో అప్పటినుండి ఈమె పేరు చాలా వైరల్ గా మారుతుంది.
అంతే కాదు నాగచైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.అయితే ఈ విషయంపై శోభితా ధూళిపాల ఎంత ఘాటుగా స్పందించినప్పటికీ ఈ వార్తలు ఆగడం లేదు.
అలాగే నాగచైతన్య (Naga Chaitanya) ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా ఆయనకు శోభితా కి సంబంధించిన రిలేషన్ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.దీనికి కూడా ఆయన ఓపిగ్గా సమాధానం చెబుతూ అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇస్తున్నారు.
అయితే వీరిద్దరూ కలిసి దిగినట్లు వచ్చే ఫోటోలన్నీ ఫేక్ అని,మార్ఫింగ్ చేసి ఫోటోలు అలా సెట్ చేశారని ఇలా ఎన్నో వార్తలు వినిపించాయి.

ఇదంతా పక్కన పెడితే తాజాగా నాగచైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శోభితా ధూళిపాల మరో అబ్బాయి తో మీడియాకి అడ్డంగా దొరికిపోయింది.శోభితా ధూళిపాల ముంబై (Mumbai) లోని ఓ రెస్టారెంట్ నుండి ఒక అబ్బాయి తో కలిసి బయటికి వస్తున్న సమయంలో మీడియా ఆమెను చుట్టుముట్టారు.ఇక వారిని చూసి హడావిడిగా అక్కడ నుండి వారి ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండానే శోభితా వెళ్ళిపోయింది.