Nagarjuna Raviteja: నాగార్జున దగ్గర రవితేజ నిజంగానే అప్పు చేశారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది.ఇండస్ట్రీ మొదలైనప్పటి నుండి అది కామన్ గానే ఉంది.

 Did Raviteja Really Owe Money To Nagarjuna-TeluguStop.com

అయితే కొంతమంది నటీనటుల పై కొన్ని చెత్త రూమర్లు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

అయితే వాటిపై కొన్నిసార్లు సెలబ్రెటీస్ స్పందించడానికి కూడా ఇష్టపడరు.

ఇక కొంతమంది సెలబ్రిటీలు అయితే స్పందించకపోతే ఇంకా ఎలాంటి వార్తలు వినవలసి వస్తుందో అని వాటి గురించి తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు.అయితే రీసెంట్ గా మాస్ మహారాజ రవితేజ (Raviteja) ఓ యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారని, కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో వెనక్కి తగ్గారు అంటూ ఒక బ్యాడ్ రూమర్ ఈయనపై వినిపించింది.

కానీ అందులో ఎలాంటి నిజం లేదు.

Telugu Dhamaka, Krishna Vamshi, Nagarjuna, Raviteja, Sreeleela-Latest News - Tel

ఎందుకంటే ఆయన ధమాకా సినిమా సమయంలో శ్రీలీల (Sreeleela) తో సరదాగా మాట్లాడుతూ ఏం నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే శ్రీలీల కూడా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చినట్టు ఆ మధ్యకాలంలో ఒక వార్త చక్కర్లు కొట్టింది.ఇక దీన్ని బేస్ చేసుకుని రవితేజ ఆ యంగ్ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అంటూ రూమర్లు పుట్టిస్తున్నారు.ఇదిలా ఉంటే రవితేజ పై మరో రూమర్ చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే రవితేజ ఆ స్టార్ హీరో దగ్గర అప్పు తీసుకున్నారని.

Telugu Dhamaka, Krishna Vamshi, Nagarjuna, Raviteja, Sreeleela-Latest News - Tel

ఇక అసలు విషయం ఏమిటంటే.రవితేజ మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే నాగార్జున నిన్నే పెళ్లాడుతా (Ninne Pelladatha) సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు.

ఇక ఆ సమయంలోనే రవితేజ నాగార్జున దగ్గర అప్పు తీసుకున్నారంటూ ఒక వార్త వినిపించింది.కానీ అసలు నిజం ఏంటంటే.

రవితేజ ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినందుకు గానూ ఆయనకు రెమ్యూనరేషన్ గా 3,500 చెక్కుని ఇచ్చారట.కానీ ఈ విషయం తెలియని కొంతమంది రవితేజకు తినడానికి తిండి కూడా లేకపోతే నాగార్జున (Nagarjuna) డబ్బులు అప్పుగా ఇచ్చి ఆదుకున్నారు అంటూ ఇలా ఓ చెత్త రూమర్ చక్కర్లు కొట్టింది.

కానీ అందులో ఎలాంటి నిజం లేదు.రవితేజ చేసిన పనికే ఆయనకు రెమ్యూనరేషన్ ఇచ్చారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube