పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఈ పేరు చెబితేనే అభిమానులకు పూనకాలు వస్తాయి.సినీ నటుడిగా రాజకీయ నాయకుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు.
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఒక వ్యాధితో తరచూ బాధపడే వారట ఈ వ్యాధి కారణంగా ఆయన డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయారని తెలుస్తుంది.
ఇలా ఎంతో చురుగ్గా చలాకి గా ఉండే పవన్ కళ్యాణ్ డిప్రెషన్ ( Depression ).లోకి వెళ్లిపోయే అంతగా ఎలాంటి సమస్యలతో బాధపడ్డారనే విషయానికి వస్తే ఈయనకు చిన్నప్పుడు ఆస్తమా సమస్య ఉండేదట, ఆస్తమాతో బాధపడటమే కాకుండా తరచూ హాస్పిటల్ కి వెళ్లేవారని, ఆస్తమా కారణంగా అధిక ఒత్తిడి కావడంతో స్కూల్ కి కూడా సరిగా వెళ్లేవారు కాదని తద్వారా ఎంతో ఒత్తిడి డిప్రెషన్ కి గురయ్యారని తెలుస్తోంది.ఈ డిప్రెషన్ కారణంగానే పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఎక్కువగా పుస్తకాలు చదివే వారిని తెలుస్తుంది.ఈ విధంగా ఆస్తమా సమస్యతో బాధపడుతున్నటువంటి ఈయన డిప్రెషన్ లోకి వెళ్లి ఒకానొక సమయంలో సూసైడ్ కూడా చేసుకోవాలన్న ప్రయత్నాలు కూడా చేశారట.
తన అన్నయ్య వదిన సురేఖ( Surekha ) సహాయంతో ఈయన తన డిప్రెషన్ నుంచి ఆ ఒంటరితనం నుంచి బయటపడి తన వదిన ప్రోద్బలంతోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ అనంతరం ఇండస్ట్రీలో నిలదొక్కుకొని స్టార్ హీరోగా సక్సెస్ సాధించారు.అదేవిధంగా ప్రస్తుతం రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టి రాజకీయాలలో కూడా సక్సెస్ సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా చాలా బిజీగా ఉన్నారు.