రెబల్ స్టార్ కృష్ణంరాజు( Krishnam Raju ) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో హీరోగా అందరికీ పరిచయమయ్యారు.ఇలా మొదటి సినిమాతోనే తన నటనతో అందరిని మెప్పించినటువంటి ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో అనంతరం వరస అవకాశాలను అందుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ప్రభాస్ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.

రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా( Bahubali ) ఈయన కెరియర్ ను పూర్తిగా మార్చేసిందని చెప్పాలి.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.అప్పటినుంచి ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇక ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ప్రభాస్>( Prabhas ) గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రభాస్ మంచితనం గురించి ఇదివరకే ఎంతోమంది ఆయనతో పని చేసిన వారు తెలియజేశారు.అయితే ప్రభాస్ కి మరొక పాడు అలవాటు కూడా ఉందని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.మరి ఈయనకు ఉన్నటువంటి ఆ చెడ్డ అలవాటు ఏంటి అనే విషయానికి వస్తే.
అదే మొహమాటం.ప్రబాస్ కి చాలా మొహమాటమట తన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడిన తనకు ఎవరైనా చెడు చేస్తున్నారని తెలిసిన ఇది తప్పు అని ఈయన ఎప్పుడూ కూడా ఎదురు చెప్పరట దీన్నే అవకాశంగా చేసుకొని కొంతమంది డైరెక్టర్లు ప్రభాస్ కి ఒక సినిమా కథ వినిపించి ఆయనకు తెరపై మరొక సినిమా చేసి చూపించి భారీగా మోసం చేశారని కూడా తెలుస్తోంది.

ఇక ప్రభాస్ ( Prabhas )గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారని తెలిసినా కూడా ఈయన నవ్వుతూ వాటిని చాలా లైట్ గా తీసుకుంటారట.అయితే ఇదంతా ఆయనకు ఉన్నటువంటి మొహమాటం తన మంచితనమే కారణమని చెప్పాలి.అయితే మరి అన్ని విషయాలలోనూ ఇలా మొహమాటానికి పోయి అతి మంచితనం ప్రదర్శిస్తే తన కెరీయర్ కే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని ఈ విషయంలో ప్రభాస్ తప్పకుండా మారాల్సిన పరిస్థితిలు ఉన్నాయి అంటూ అభిమానులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.నిజంగానే ప్రభాస్ మొహమాటం అతో మంచితనం పనికిరాదని మరికొందరు కూడా అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.







