ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ 7 ( Bigg Boss 7 ) గురించే వార్తలు కనిపిస్తున్నాయి.వినిపిస్తున్నాయి.
ఎన్నో అంచనాల మధ్య బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే గత సీజన్ అట్టర్ ప్లాఫ్ అవడంతో ఎలాగైనా ఈ సీజన్ సరికొత్తగా ప్లాన్ చేయాలని బిగ్ బాస్ యూనిట్ వాళ్ళు ఆలోచించారు.
కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా హౌస్ లోకి వచ్చిన 14 మంది అంతగా ఫేమస్ అయిన వాళ్ళు కాదు.అందులో చాలా తక్కువ మంది మొహాలు సినీ ప్రేక్షకులకు తెలుసు.
అలా హీరో శివాజీ, కార్తిక దీపం శోభా శెట్టి నటి, షకీలా, జానకి కలగనలేదు నటుడు అమర్దీప్( Amardeep ) , జానకి కలగనలేదు నటి ప్రియాంక జైన్,ఆట సందీప్ తప్ప మిగిలిన వాళ్ళు అంతగా ప్రేక్షకులకు తెలిసినవాళ్లు కాదు.

ఇందులో సింగర్ దామిని ( Singer Damini ) ఎక్కువగా తెలియదు.అలాగే నటి రతిక, శుభశ్రీ, మోడల్ యావర్, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ వంటి వాళ్ళు అంతగా పరిచయం లేదు.అలాగే హీరోయిన్ కిరణ్ రాథోడ్ ( Kiran Rathore )ఒకప్పుడు నటి కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఆమెను అంతగా గుర్తుపట్టరు.
అయితే ఈసారి కూడా కంటెస్టెంట్ల విషయంలో అంతగా ఫేమస్ అయిన వాళ్ళని తీసుకురాకపోవడంతో మరోసారి బిగ్ బాస్ ప్రేక్షకులు నిరాశ పడుతున్నారు.అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది.

అదేంటంటే ఈ సీజన్ లో నాగార్జున ( Nagarjuna ) కి ఇష్టం లేకుండానే ఆ ఇద్దరు కంటెస్టెంట్లని బిగ్ బాస్ యూనిట్ వాళ్ళు హౌస్ లోకి పంపించారట.ఇక అందులో ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నవారు.అలాగే మరొకరు అందాలు ఆరబోయడంలో ఏమాత్రం తీసిపోని నటి .ఇలా ఇద్దరినీ బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ లోకి తీసుకురావడం నాగార్జునకి అస్సలు ఇష్టం లేదట.కానీ ఈ విషయం బిగ్ బాస్ యూనిట్ వాళ్ళకి చెబితే సారీ సార్ పేమెంట్ సెటిల్మెంట్ కూడా జరిగిపోయింది.అలాంటిది ఇప్పుడు వారిని తీసేస్తే బయట రచ్చ రచ్చ జరుగుతుంది అంటూ నాగార్జున్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట.
ఇక నాగార్జున కూడా చేసేదేమీ లేక అయిష్టంగానే ఆ ఇద్దరు కంటెస్టెంట్లని హౌస్ లోకి పంపించినట్టు తెలుస్తోంది.ఇక ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నాగార్జునకి ఇష్టం లేని ఆ కంటెస్టెంట్లు ఎవరబ్బా అంటూ నెటిజన్స్ ఆలోచనలో పడ్డారు.