Jayalalitha: ఎంజీఆర్ జయలలిత ని నిజంగానే పెళ్లి చేసుకున్నారా.. ఆరోజు ఏం జరిగిందంటే..?

తమిళ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన నటీనటుల్లో ఎంజీఆర్ జయలలిత ( MGR,Jayalalitha ) ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.వీరిద్దరూ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు.

 Did Mgr Really Marry Jayalalitha-TeluguStop.com

అయితే అలాంటి ఈ ఇద్దరు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.ఎంజీఆర్ నిజంగానే జయలలితని పెళ్లి చేసుకున్నారా.

అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.జయలలిత తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టింది ఎంజీఆర్ తోనే.

ఎంజీఆర్ ( MGR ) తో కలిసి దాదాపు 32 కు పైగా సినిమాల్లో జయలలిత చేసింది.ఇక ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎన్నో ఎఫైర్ వార్తలు తమిళ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.

కానీ వీటిని వీరిద్దరూ ఖండించకపోయేసరికి అంతా నిజమే అని భావించారు.ఇక అప్పటికే ఎంజీఆర్ కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి.

మొదటి భార్య అనారోగ్య సమస్యలతో చనిపోతే రెండో భార్య అనుమానస్పదంగా చనిపోయిందట.ఇక మూడో భార్య జానకి ( Janaki ) కి మొదట పెళ్ళై బాబు ఉన్నప్పటికీ ఆమెను ప్రేమించి మళ్లీ పెళ్లి చేసుకున్నారట ఎంజీఆర్.

అయితే ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడో భార్య ఉండగా జయలలితని ఎంజీఆర్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని మీ అందరికీ అనుమానం రావచ్చు.అయితే ఎంజీఆర్ జయలలితల పెళ్లి జరిగింది అనేది అవాస్తవం.

కానీ వీరిద్దరి మధ్య ఎఫైర్ వార్తలు రావడం మాత్రం వాస్తవం.

Telugu Gossips, Janaki, Jayalalitha, Kollywood, Mg Chakrapani, Sobhan Babu-Lates

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు వస్తే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అంటూ వార్తలు రావడం అనేది సర్వసాధారణం.ఇక అప్పట్లో వీరిద్దరి మధ్య కూడా అవే వార్తలు చక్కెర్లు కొట్టాయట.అయితే వీరి పెళ్లి వార్తలు రావడానికి ప్రధాన కారణం ఎంజీఆర్ మూడో భార్య జానకి తో కలిసి ఓ ఫంక్షన్ లో పాల్గొన్నారట.

ఇక అదే ఫంక్షన్ కి జయలలిత కూడా రావడం ఇక ఆ ఫంక్షన్ లో ఒకే దగ్గర ఎంజీఆర్, ఆయన భార్య, జయలలిత వరుసగా కూర్చోవడంతో ఆ ఫంక్షన్ కి వచ్చిన వారంతా ఎంజీఆర్ మూడో భార్యను వదిలేసి జయలలితనే ఆయన భార్య గా ట్రీట్ చేశారట.

Telugu Gossips, Janaki, Jayalalitha, Kollywood, Mg Chakrapani, Sobhan Babu-Lates

అంతేకాదు ఆ ఫంక్షన్ లో ఎంజీఆర్ భార్యను వదిలేసి జయలలిత కి ఎంజీఆర్ కి సన్మానం చేశారట.ఇక అన్ని చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ నోరు మెదపక పోయేసరికి అందరూ ఇది నిజమే అని భావించారట.కానీ అక్కడే ఉన్న ఎంజీఆర్ అన్న ఎంజి చక్రపాణి ( MG Chakrapani ) ఇలా ఎంజీఆర్ నోరు మెదపకుండా జయలలితతో వార్తలు కంటిన్యూ అయితే తన రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో ఎంజీఆర్ కి దూరంగా ఉండమని జయలలితకి వార్నింగ్ ఇచ్చారట.

కానీ ఇవన్నీ పట్టించుకోని జయలలిత ఎంజీఆర్ తో సినిమాల్లో నటిస్తూ బయట కూడా సన్నిహితంగా మెదిలేదట.ఇక ఎప్పుడైతే శోభన్ బాబు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి ఎంజీఆర్ కి దూరమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube