ఇప్పుడు హాట్ టాపిక్ అంతా మునుగోడు ఉప ఎన్నికపైనే. నల్లగొండ కాంగ్రెస్ కంచుకోటలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్య మైంది.
అయితే ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీలు జోరు పెంచాయి.పలువురు నేతలు ప్రెస్ మీట్ లు పెడుతూ కాక రేపుతున్నారు.
అభ్యర్థుల వేటలో ఉన్నారు.ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
దీనిపై కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా ఫైర్ అయ్యారు.ఏదైమైనప్పటికీ ఇప్పుడు ఫోకస్ అంతా మునుగోడుపైనే పెట్టారు.
అయితే మునుగోడులో ఇలాంటి పరిస్థితి వస్తుందని కేసీఆర్ ముందుగానే ఊహించారా.? అందుకే ముందుగానే దృష్టి పెట్టారా.? పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగనున్నారా.అంటే ఔననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.
ఇప్పటికే అన్ని విషయాలు చర్చించి వ్యూహాన్నిరెడీ చేసినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా తథ్యం అని ముందుగానే భావించి నియోజకవర్గంపై.
పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారని అంటున్నారు.రాజగోపాల్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నప్పటి నుంచే రాజీనామా చేస్తారని.
ఉప ఎన్నికలు వస్తాయనే అంచనాతోనే సీఎం కేసీఆర్ అక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారని అంటున్నారు.ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండేలా ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమై అన్ని విషయాలపై చర్చించినట్లు చెప్తున్నారు.
నియోజకవర్గ సమస్యలపై అడిగి తెలుసుకున్నారని అంటున్నారు.ఈ నేపథ్యంలోనే గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించారు.అలాగే నియోజకవర్గంలోని బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు.
గత ఉప ఎన్నిక ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.
గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ లలో ఓటమి పాలైన నేపథ్యంలో మునుగోడులో గెలుపును పార్టీ కీలకంగా భావిస్తోంది.అక్కడ చేసిన తప్పిదాలను మళ్లీ చేయకుండా జాగ్రత్త పడుతున్నారట.అభ్యర్థి ఎంపిక, ప్రచారం. పై ఫోకస్ పెట్టి పకడ్బందీగా నిర్వహించేలా వ్యూహాలు సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారట.అయితే గతంలో 2018 శాసనసభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఓడిపోయినా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు.అయితే ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాజీ, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడైన అమిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అలాగే మరికొంత మంది పార్టీ నేతలు కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి, మరో బీసీ నాయకుడు రవితో పాటు మరికొందరు మునుగోడు సీటుపై ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.