గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం….టీడీపీకి కంచుకోట.
ముఖ్యంగా ధూళిపాళ్ళ ఫ్యామిలీ అడ్డా.టీడీపీ ఆవిర్భావం నుంచి పొన్నూరులో ధూళిపాళ్ళ ఫ్యామిలీ సత్తా చాటుతునే ఉంది.
కమ్మ సామాజికవర్గానికి చెందిన ధూళిపాళ్ళ ఫ్యామిలీ నుంచి 1983, 1985, 1989 వీరయ్య చౌదరీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు.ఇక వీరయ్య తర్వాత ఆయన తనయుడు నరేంద్ర 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.అయితే ఇలా వరుసగా గెలిచి డబుల్ హ్యాట్రిక్‌కు సిద్ధమైన నరేంద్రకు జగన్ గట్టి దెబ్బ కొట్టారు.
2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో నరేంద్ర పొన్నూరు బరిలో ఓటమి పాలయ్యారు.వైసీపీ నుంచి పోటీ చేసిన కిలారు రోశయ్య విజయం సాధించారు.ఇక మొదటి సారి పొన్నూరు బరిలో వేరే పార్టీ గెలవడం జరిగింది.తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోశయ్య…తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు.ప్రభుత్వ పథకాలు ఈయనకు అడ్వాంటేజ్.
కానీ నరేంద్ర హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరగడం లేదు.జగన్ ప్రభుత్వం పూర్తిగా అప్పులు చేసి సంక్షేమం మీద దృష్టి పెట్టి, మిగతా కార్యక్రమాలని గాలికొదిలేసింది.

దీంతో చాలాచోట్ల వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇక పొన్నూరులో కూడా అదే పరిస్తితి ఉంది.ఎన్నికల్లో ఓడిపోయాక నరేంద్ర నిదానంగా టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు.నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేస్తున్నారు.పైగా పొన్నూరు ధూళిపాళ్ళ ఫ్యామిలీ కంచుకోట.దీంతో నియోజకవర్గంలో ధూళిపాళ్ళ నరేంద్ర త్వరగానే పుంజుకున్నారు.
ప్రస్తుతం జరిగే పంచాయితీ ఎన్నికల్లో ఇక్కడ ధూళిపాళ్ళ హవా బాగానే ఉండేలా ఉంది.కానీ అధికారంలో ఉండటం వైసీపీకి అడ్వాంటేజ్.అయితే ఎక్కువ శాతం పంచాయితీలు టీడీపీకే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.మొత్తానికైతే కమ్మవారి కోటలో ఫ్యాన్ స్పీడ్ తగ్గినట్లే ఉంది.