నాని ఇంతమంది కొత్త దర్శకులని పరిచయం చేశాడా..?

ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ మొదలు పెట్టిన నాని( Nani ) అనుకోకుండా వచ్చిన అవకాశంతో కెమెరా ముందుకొచ్చి హీరో అయ్యాడు.

ఇక నాని ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి.

ఎలాంటి సినిమా నేపథ్యంలో లేకుండా టాలెంట్, హార్డ్ వర్క్ తో పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్నారు.అలా అష్టా చెమ్మా ( Ashta chemma )మూవీతో నాని హీరో అయ్యాడు.2008లో విడుదలైన ఆ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది.స్నేహితుడు అనే మరో చిన్న సినిమాతో నాని అద్భుతం చేశాడు.

అలా మొదలైంది చిత్రంతో ప్రేక్షకుల కంట్లో పడ్డాడు.నానికి ఫేమ్ తెచ్చిన మొదటి సినిమా అలా మొదలైంది.

నాని నటుడిగా 15 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు.తన సహజమైన నటన, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ నాని ప్రధాన బలాలు.

Advertisement

అయితే శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి ( Shyam Singarai , Ante sundharaniki )లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం మంచి జోష్ మీద వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు నాని.తన కెరీర్ మొత్తం లో నాని స్టార్ డైరెక్టర్స్ తో కంటే కొత్త దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేసారు.

స్టార్డం వచ్చాక కూడా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు నాని.ఇప్పుడు నాని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో చూద్దాం.

శ్రీకాంత్ ఓదెలనాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ‘దసరా’.ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela )దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

నాగ్ అశ్విన్నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం తో నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

అంజనా అలీనిత్య మీనన్, నాని ప్రధాన పాత్రల్లో వచ్చిన తమిళ చిత్రం వెప్పం.దీన్ని తెలుగులో ‘సెగ’ అనే పేరుతో రిలీజ్ చేసారు.ఈ చిత్ర దర్శకురాలు అంజనా అలీ ఖాన్( Anjana Ali Khan ) కి ఇది మొదటి చిత్రం.

Advertisement

నందిని రెడ్డినాని కి కమర్షియల్ హీరో గా పేరు తెచ్చిన చిత్రం అలా మొదలైంది.నందిని రెడ్డి ( Nandini Reddy )ఈ చిత్రం తో దర్శకురాలిగా పరిచయం అయింది.ఇక ఈ సినిమా తర్వాత ఆమె ఇంకా చాలా సినిమాలకి డైరెక్షన్ చేసింది.

తాతినేని సత్యభీమిలి కబడ్డీ జట్టు చిత్రం తో తాతినేని సత్య ( tatineni satya )దర్శకుడిగా పరిచయం అయ్యారు.

శివ నిర్వాణనాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం నిన్ను కోరి.ఈ చిత్రం తో శివ నిర్వాణ( Shiva Nirvana ) దర్శకుడిగా పరిచయం అయ్యారు.

శౌర్యవ్నాని తన తర్వాతి చిత్రం ప్రకటించారు.ఆ చిత్రాన్ని తో కూడా కొత్త డైరెక్టర్ ని లాంచ్ చేస్తున్నాడు నాని.గోకుల్ కృష్ణనాని, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఆహా కళ్యాణం.

ఈ చిత్రం తో గోకుల్ కృష్ణ( Gokul Krishna ) దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ప్రశాంత్ వర్మఅ! చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయ్యారు ప్రశాంత్ వర్మ( Prashant Verma ).ఈ చిత్రానికి నాని నిర్మాత.

శైలేష్ కొలనువిశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ చిత్రం తో శైలేష్ కొలను( Shailesh kolanu ) డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందారు శైలేష్ కొలను.ఇక దాని తర్వాత వచ్చిన హిట్ 2 చిత్రం కూడా శైలేష్ డైరెక్షన్ చేసిందే.ఇక ఈ ప్రంచైజ్ చిత్రాలకు నాని నే నిర్మాత గా వ్యవహరించారు.

తాజా వార్తలు