సినిమాకొక గర్ల్ ఫ్రెండ్ ఉండేదా.. అసలు సీక్రెట్ బయటపెట్టిన డీజే టిల్లు?

నందమూరి నటసింహం బాలయ్య కేవలం హీరోగా మాత్రమే కాకుండా తనలో మరో యాంగిల్ కూడా దాగి ఉంది అంటూ ఈయన ఆహాలో ప్రసారమవుతున్న ఆన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకోగా రెండవ సీజన్ కూడా ప్రారంభించారు.

ఇక రెండవ సీజన్ కూడా ఇప్పటికే రెండు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.రెండవ ఎపిసోడ్లో భాగంగా సిద్దు జొన్నలగడ్డ విశ్వక్ సేన్ హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఇద్దరు హీరోల వ్యక్తిగత విషయాల నుంచి వృత్తిపరమైన విషయాలు మాత్రమే కాకుండా లవ్ బ్రేకప్ వంటి రొమాంటిక్ సన్నివేశాల గురించి కూడా ప్రశ్నించారు.ఈ క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.

రిలేషన్షిప్ అన్న తర్వాత బ్రేకప్ అవ్వడం సర్వసాధారణం కదా సర్ అంటూ చెప్పడంతో వెంటనే బాలయ్య ఎన్ని బ్రేకప్ లు అయ్యాయి ఏంటి అంటూ ప్రశ్నించారు.బాలకృష్ణ ఇలా అడగడంతో మన డిజేటిల్లు షాకింగ్ సమాధానం చెప్పారు.

Advertisement

బాలయ్య అడిగిన ప్రశ్నకు సిద్ధ సమాధానం చెబుతూ మనస్పూర్తిగా మూడు బ్రేకప్ అయ్యాయి సర్ అంటూ సమాధానం చెప్పారు.సినిమాకు గర్ల్ ఫ్రెండును మార్చావా అంటూ బాలయ్య అనగా.సినిమాకొక గర్ల్ ఫ్రెండ్ కాదు సార్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల కారణంగా ఆ ప్రభావం సినిమాలపై పడుతుందంటూ ఈ సందర్భంగా డిజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ తన బ్రేకప్ గురించి ఈ కార్యక్రమం సందర్భంగా ఓపెన్ అయ్యారు.

ప్రస్తుతం ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు