ఈటీవీ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’( Jabardasth ) అనే కామెడీ షో గత పదేళ్ల నుండి విజయవంతంగా కొనసాగుతూ ఇప్పటికీ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ కామెడీ షో నుండి ఎంతో మంది కమెడియన్స్ నేడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్నారు.
ఈ షో నుండి పరిచయమైనా ప్రతీ ఒక్క కమెడియన్ కి అంతకు ముందు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేదు.జీరో నుండి ప్రారంభమై జీవితం లో ఎన్నో కష్టాలు మరియు ఒడిదుడుకులు ఎదురుకొని వచ్చిన వాళ్ళే.
అలాంటి వారిలో చమ్మక్ చంద్ర( Chammak Chandra ) కూడా ఒకడు.ఈ షో ద్వారా ఆయన ఎంత మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడో మన అందరికీ తెలిసిందే.
తన డిఫరెంట్ కామెడీ టైమింగ్ మరియు బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకుల పొట్టచెక్కలు అయ్యే రేంజ్ కామెడీ ని పండించే స్కిట్స్ ఆయనవి ఎన్నో ఉన్నాయి.
ఆయనలోని డిఫరెంట్ కామెడీ టైమింగ్ ని నచ్చే టాలీవుడ్( Tollywood ) దర్శక నిర్మాతలు కూడా ఆయనకీ అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు.ఇప్పుడు ఆయన మోస్ట్ బిజీ కమెడియన్స్ లో ఒకడిగా మారిపోయాడు.కొంతమంది స్టార్ డైరెక్టర్స్ కి ఆస్థాన కమెడియన్ గా కూడా ఆయన మారిపోయాడు.ఉదాహరణకి తీసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) తెరకెక్కించే ప్రతీ సినిమాలో కూడా చమ్మక్ చంద్ర కి ఒక పాత్ర ఫిక్స్ అయిపోయి ఉంటుంది.‘అ.ఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’ , ‘అలా వైకుంఠపురం’ లో చిత్రాలలో చమ్మక్ చంద్ర కనిపిస్తాడు.ఇప్పుడు త్రివిక్రమ్ తెరెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ ( guntur karam )చిత్రం లో కూడా చమ్మక్ చంద్ర నటిస్తున్నాడు.
అలా కొంతమంది దర్శకులు చమ్మక్ చంద్ర కి వరుసగా తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తూ ఉన్నారు, వాళ్లకి ఆ రేంజ్ నచ్చాడు ఈయన.అయితే రీసెంట్ గా చమ్మక్ చంద్ర ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో జబర్దస్త్ షో కి రాకముందు తాను ఎదుర్కున్న కష్టాల గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.
చంద్ర మాట్లాడుతూ ‘ నేను కరీంనగర్ జిల్లాలోని బాన్సువాడ సమీపం లో ఉండే వెంకటాపురం అనే తండా కి చెందిన వాడిని.చిన్నప్పటి నుండి నాకు పెద్దగా చదువు మీద ఆసక్తి ఉండేది కాదు, నటన మీదనే ఎక్కువ ఆసక్తి ఉండేది.నేను పదవ తరగతి ఫెయిల్ అయినా తర్వాత ఇంటి నుండి హైదరాబాద్ కి వచ్చి ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడిని.నాకు డ్యాన్స్ బాగా వచ్చు, ఏదైనా పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ డ్యాన్స్ వేసేవాడిని.
నా డ్యాన్స్ చూసిన ప్రతీ ఒక్కరు ఎదో ఒకరోజు పెద్ద ఆర్టిస్టువి అవుతావు రా అని అనేవాళ్ళు.కొంతకాలం నేను డ్యాన్స్ ట్యూషన్స్ కూడా నిర్వహించాను.ఆ తర్వాత నేను నాతో పాటు తెచ్చుకున్న డబ్బులను ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చెయ్యడానికి ఉపదయోగించాను.ఆ డబ్బులు అయిపోయాక చాలా ఇబ్బందులు పడ్డాను , అప్పుడు నేను విజయ్ అనే నటుడి ఇంట్లో కొంత కాలం వంట మనిషిగా పనిచేసాను.
వచ్చే జీతం సరిపోయేది కాదు, బియ్యానికి బదులుగా నూకలు తిని బ్రతికిన రోజులవి’ అంటూ చమ్మక్ చంద్ర అప్పట్లో పడిన కష్టాలను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.