సౌత్ బ్యూటీ అమలాపాల్ ( Amala Paul ) అంటే సినీ ఇండస్ట్రీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు.ఈమె తన నటనతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.
ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తూ పాత్ర డిమాండ్ చేస్తే ఒంటిమీద నూలు పోగు లేకుండా కూడా నటించి నటిగా తన సత్తా ఏంటో చాటుకుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
దానికి ప్రధాన కారణం అమలాపాల్ బర్త్ డే సందర్భంగా తన ప్రియుడు ఆమెకు చాలా వెరైటీగా ప్రపోజ్ చేసి ఈ వీడియోని నెట్టింట్లో షేర్ చేసే సరికి అమలాపాల్ రెండో పెళ్లి ( Amala Paul Second Marraige ) నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.
అయితే అమలాపాల్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో అసలు ఆమె మొదటి భర్తకు విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటి.
ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ విజయ్ ( Vijay) ఇద్దరు ఎందుకు గొడవలు పెట్టుకొని విడాకులు ఎందుకు తీసుకున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.అమలాపాల్ కోలీవుడ్ డైరెక్టర్ అయిన ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక వీరి పెళ్లి 2014లో చాలా గ్రాండ్ గా జరిగింది.కానీ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమని పది సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోయారు.
దాంతో విజయ్ తో తన వివాహ బంధాన్ని తెంపేసుకుంది.అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ అమలాపాల్ విడిపోవడానికి కారణం అమలాపాల్ మళ్లీ సినిమాల్లో నటించడమే నట.విజయ్ పెళ్లికి ముందే అమలాపాల్ ని సినిమాల్లో నటించకూడదని కండిషన్ పెట్టారట.కానీ పెళ్లయ్యాక కొద్ది రోజులకు మళ్ళీ అమల పాల్ కి సినిమాల్లో నటించాలనే కోరిక పుట్టిందట.
దాంతో కొన్ని సినిమాల్లో చేస్తానని అగ్రిమెంట్ చేసేసరికి విజయ్ అలాగే విజయ్ తల్లిదండ్రులు ఇద్దరు సినిమాల్లో నటించకూడదు అని టార్చర్ చేశారట.
ఇక వారి టార్చర్ భరించలేని అమలాపాల్ ఇలాగే ఉంటే తన సినీ కెరీర్ మొత్తం నాశనం అవుతుందని, ఎప్పుడు వారి కాళ్ళ దగ్గరే పడుండాలని, ఇలాంటి జీవితం తనకు వద్దని విజయ్ తో విడాకులకు అప్లై చేసి ఇద్దరు 2017 లో విడాకులు తీసుకున్నారు.ఇక విజయ్ అమలాపాల్ తో విడాకుల తర్వాత ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఇక త్వరలోనే అమలాపాల్ కూడా జగత్ దేశాయ్ ( Jagath desai ) అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోబోతుంది.