జబర్దస్త్ నుంచి బయటకు వస్తే పర్సనల్ గిఫ్ట్ లు.. షాకింగ్ విషయాలు రివీల్!

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది.అనసూయ, రష్మీలకు ఈ షో ద్వారా స్టార్ యాంకర్లుగా గుర్తింపు దక్కింది.

 Did All Happens As A Part Of Mega Brother Plan Details Here , Jabardasth, Other-TeluguStop.com

ఎంతోమంది కమెడియన్లు ఈ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమై ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.అయితే గత కొన్నిరోజులుగా ఈ షో కళ తప్పుతోంది.

జబర్దస్త్ కమెడియన్లు వరుసగా ఈ షోకు గుడ్ బై చెబుతూ ఈ షో చూస్తున్న ప్రేక్షకులకు, జబర్దస్త్ అభిమానులకు షాకిస్తున్నారు.

తాజాగా అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

నాగబాబు ఇచ్చిన భరోసా వల్లే అనసూయ ఈ షోకు గుడ్ బై చెప్పిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.స్టార్ మా ఛానెల్ లోకి ఎంట్రీ ఇచ్చినందుకు భారీ మొత్తంలో అనసూయకు పారితోషికం దక్కిందని సమాచారం అందుతోంది.

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వాళ్లకు ఆ షో నుంచి దూరమైన జడ్జి భారీ ఆఫర్లను ఇప్పించడంతో పాటు పర్సనల్ గిఫ్ట్స్ ఇస్తున్నారని సమాచారం.

అనసూయ, ఇతర జబర్దస్త్ కమెడియన్లు జబర్దస్త్ ను వీడటం గురించి స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జబర్దస్త్ షోకు దూరమైన కమెడియన్లు భవిష్యత్తులో ఈ షోలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉండవని సమాచారం అందుతోంది.ఎంతోమంది కమెడియన్ల కెరీర్ ను మలుపుతిప్పిన షోకు ఈ పరిస్థితి రావడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Telugu Jabardasth, Tv Channels, Personal Gifts-Movie

జబర్దస్త్ షో రేటింగ్స్ కూడా క్రమంగా తగ్గుతుండటం గమనార్హం.ఈటీవీలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ కు పోటీగా ఇతర ఛానెళ్లలో ప్రసారమయ్యే షోలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది.రష్మీ, హైపర్ ఆది కూడా ఈటీవీ షోలకు గుడ్ బై చెబితే మాత్రం ఈటీవీ ఛానల్ ర్యాంకింగ్ మరింత దారుణంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube