అప్పుడప్పుడు సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయాలను కొన్ని క్లూస్ ద్వారా బయటపడుతూ ఉంటారు.చాలా వరకు తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలలో మాత్రం నేరుగా కొన్ని క్లూస్ ఇస్తూ ఉంటారు.
అంటే తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము అన్నట్లుగా ముందుగానే హింట్ లు ఇస్తూ ఉంటారు.అయితే తాజాగా శివాని రాజశేఖర్(Shivani Rajasekhar) కూడా ఒక ఫోటో షేర్ చేసుకోవడంతో అందరూ తనకు ఎంగేజ్మెంట్ (Engagement) జరిగిందేమో అని అనుమానంలో ఉంటున్నారు.
ఇంతకు ఆ ఫోటోలో ఏముందో తెలుసుకుందాం.
శివాని రాజశేఖర్ ఎవరో కాదు ప్రముఖ స్టార్ హీరో రాజశేఖర్ కూతురు.
తండ్రి హోదాతో అడుగుపెట్టిన ఈమె మొత్తానికి నటిగా నిరూపించుకుంది.నాలుగేళ్ల కిందట వచ్చిన 2 స్టేట్స్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి నటిగా అడుగుపెట్టింది.
అదే ఏడాది వివి స్టూడియోస్ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా పరిచయం అయింది.ఇక ఆ సినిమాలతో తనకు మంచి సక్సెస్ రావటంతో ఆ తర్వాత అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటించింది.

అంతేకాకుండా ఓటీటీ వేదికగా కూడా పలు సిరీస్ లు చేసింది.ఆహా నా పెళ్ళంట(Aha naa pellanta) అనే వెబ్ సిరీస్ కూడా చేసిన సంగతి తెలిసిందే.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.ఇక ప్రస్తుతం స్టార్ హోదాకు రావటం కోసం బాగా ప్రయత్నిస్తుంది.కానీ అంత పెద్ద పెద్ద సినిమాలలో మాత్రం అవకాశాలు అందుకోవటం లేదు.

ఇక ఖాళీ సమయం దొరికితే సోషల్ మీడియాలో అడుగుపెట్టి బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను కూడా పంచుతూ షాక్ ఇస్తుంది.ఇక తన ఫాలోవర్స్ తో కూడా సరదాగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.

ఏమాత్రం మొహమాట పడకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని బాగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది.పైగా ఇంట్లో తల్లిదండ్రులు సపోర్ట్ ఉండటంతో గ్లామర్ షో చేయటంలో అస్సలు వెనుకాడటం లేదు.ఇక తన చెల్లె శివాత్మిక (Shivatmika) కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సంగతి తెలిసింది.ఈమె కూడా తండ్రికి తగ్గట్టు పేరు తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా శివాని రాజశేఖర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.అయితే ఆ స్టోరీలో ఒక టేబుల్ పై.టీ కప్, గాగుల్స్ ఉండగా వాటి పక్కనే రెండు రింగ్స్ కూడా ఉన్నాయి.దీంతో అందరూ అది చూసి.
టీ పాయింట్ లో శివాని ఎంగేజ్మెంట్ చేసుకుందా అంటూ అనుమానం పడుతున్నారు.లేదంటే ఆ ఫోటో ఎందుకు పంచుకుంటుంది అని.నిజంగానే ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగిందేమో బాగా డౌట్ పడుతున్నారు.మరి అసలు విషయం ఏంటో శివాని ద్వారా తెలియాల్సి ఉంది.







