ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించాక చాలా మార్పులు జరిగాయి.ముఖ్యంగా అమెరికా, యూకే(America, UK) ఇతర యూరప్ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి.
దీని ఫలితంగా ఆంక్షలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపాయి.అక్కడ మెడికల్ దుకాణాల్లో చాలా ముఖ్యమైన మందుల కొరత ఏర్పడింది.
ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) సైతం అంగీకరించారు.అంతేకాకుండా దేశంలో ఎక్కువ మందుల ఉత్పత్తి ఉన్నప్పటికీ ధరలు పెరిగాయి.
ఇదే కాకుండా రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా ఎన్నో తీవ్రమైన ఆంక్షలను అమెరికా, యూకే, ఇతర పాశ్చాత్య దేశాలు తీసుకున్నాయి.తాజాగా ఓ షాకింగ్ విషయం బయటపడింది.
రష్యాపై విధించిన ఆంక్షలు ఏమీ పని చేయడం లేదని తెలుస్తోంది.అక్కడి ప్రజలు ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నట్లు వెల్లడైంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై(Ukraine) దాడి చేసినప్పుడు, అంతర్జాతీయ సమాజం ఆక్రమిత దేశంపై ఆంక్షలు విధించింది.వారు సంపన్న, శక్తివంతమైన రష్యన్ బిలియనీర్ల ఆస్తులను స్తంభింపజేశారు.వివిధ రకాల రక్షణ మరియు సమాచార సాంకేతికతలపై రష్యా పొందకుండా నిరోధించడానికి పనిచేశారు.రష్యన్ బ్యాంకులపై ఆర్థిక ఆంక్షలు విధించారు.విదేశీ మూలధనం మరియు ఆర్థిక మార్కెట్లకు రష్యా ప్రాప్యతను తగ్గించారు.అయితే ఇవన్నీ రష్యా ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపలేకపోయాయి.
ప్రస్తుతం రష్యాలో ఎక్కడ చూసినా విదేశీ బ్రాండ్ల ఉత్పత్తులు కనిపిస్తున్నాయి.కోకోకోలాలు, ఐఫోన్లు, మెక్ డొనాల్డ్స రెస్టారెంట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి.
మిగిలిన దేశాల నుంచి వీరికి కావాల్సిన ఉత్పత్తులు వస్తూనే ఉన్నాయి.ప్రజలు తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు పడినా ఇప్పుడు అవేమీ లేవు.
క్రమంగా ప్రజలు సాధారణ జీవితం జీవిస్తున్నారు.ఈ ఏడాది 0.3 శాతం వృద్ధిని రష్యా నమోదు చేయనుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.







