బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కవర్ పేజీ శ్రీ మహా విష్ణువు రూపంలో పోజు పెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ ఫోటో 2013 లో సంచలనం సృష్టించింది.ఆ ఫోటో కి సంబంధించి మన అనంతపూర్ కోర్టులో ఇప్పటికీ కేసు నడుస్తూ ఉoడడం విశేషం.
ఆ ఫోటో లో విష్ణు మూర్తి అవతారంలో ఉన్న ధోనీ బూట్లు పట్టుకుని ఉండడం వివాదాస్పదం అయ్యింది.
ఇండియన్ యాడ్ మార్కెట్ లో ధోనీ విశ్వరూపం అనే విశ్లేషణను చేస్తూ.
ఆ పత్రిక ధోనీని అలా చిత్రీకరించింది.మరి పత్రిక ఎడిటర్ల క్రియేటివిటీ ధోనీకి ప్రమాదంగా మారి వెన్నాడుతోంది.
ప్రత్యేక న్యాయవాదిని పెట్టుకుని మరీ ధోనీ ఈ కేసులో పోరాడుతున్నాడు.ధోనీ వ్యక్తిగతంగా హాజరు కాకపోవడం వలన ఇప్పుడు ధోనీ అరస్టు వైపు కేసు నడుస్తోంది.
అయితే ఇలాంటి విశ్వరూపాన్నే చంద్రబాబు కూడా అప్పట్లో ఒక ఫ్లెక్సీ లో చూపించారు.చంద్రబాబును వెంకటేశ్వర స్వామిగా.
రాముడిగా.చిత్రీకరించారు తెలుగు తమ్ముళ్లు.
ఏ మాత్రం క్వాలిటీ లేకపోయినా.మార్ఫింగ్ ఏ మాత్రం నాణ్యత లేకపోయినా… ఆ విధంగా హిందువుల మనోభావాలనైతే గాయపరిచారు తమ్ముళ్లు.
అయితే.బాబు విషయంలో మాత్రం కేసులు నమోదు కాలేదు.
తప్పు ఎవరు చేసినా తప్పే…కదా! దీని మీద కూయా అప్పట్లో కేసు పడినా నెమ్మదిగా హిందుత్వ వాదులే ముఖ్యమంత్రి తో ఎందుకులే అని విత్ డ్రా చేసేసుకున్నారు.







