బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి( Alleti Maheshwar Reddy ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ధరణి అని చెప్పారు.
కొన్ని లక్షల భూముల కుంభకోణానికి వేదిక అయిందని పేర్కొన్నారు.
ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి నలభై శాతం వాటాలు అడుగుతున్నారు కాబట్టే విషయాలు దాస్తున్నారని ఆరోపించారు.మియాపూర్ భూములపై మాట్లాడిన కేకే కాంగ్రెస్ లోకి చేరగానే ఆణిముత్యం అయ్యారని విమర్శించారు.
భూముల అవినీతిపై ఎందుకు సీబీఐ విచారణ చేయించడం లేదని నిలదీశారు.ఆర్ టాక్స్ తో పాటు బీ టాక్స్ కూడా 8 నుంచి 9 శాతం కట్టాలని చెబుతున్నారన్నారు.
ఈ నేపథ్యంలో భూముల మాయంపై సమగ్ర సర్వే చేయించాలని కేంద్రాన్ని కోరతామని ఆయన తెలిపారు.