విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాందించు కున్నాడు ధనుష్.జాతీయ నటుడిగా అవార్డు అందుకుని హాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటూ అక్కడ కూడా సినిమాలు చేస్తున్నాడు.
ధనుష్ నటిస్తున్న సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి.
దీంతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
ఈయన డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు.ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.‘సార్’ అనే టైటిల్ తో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.బైలింగ్వన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలిపారు.తమిళ్ లో ‘వాతి’ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమాతో పాటు ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్రకటించాడు.త్వరలోనే ఈ సినిమా రెగ్యురల్ షూట్ స్టార్ట్ కాబోతుంది.

ఇదిలా ఉండగా తాజాగా ధనుష్ ముచ్చటగా మూడవ తెలుగు సినిమాను లైన్లో పెట్టినట్టు నెట్టింట ఒక వార్త వైరల్ అయ్యింది.టాలీవుడ్ లో శ్రీకారం సినిమాతో మంచి హిట్ కొట్టి దర్శకుడిగా జర్నీ స్టార్ట్ చేసిన డైరెక్టర్ కిషోర్ ధనుష్ సినిమాకు డైరెక్షన్ చేయనున్నాడు అని ఈ సినిమాను దిల్ రాజు నిర్మించ బోతున్నారని టాక్.త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతున్నట్టు టాక్.చూడాలి ఈ కాంబోలో సినిమా ఉంటుందో లేదో.







