టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా గుర్తింపును సంపాదించుకున్న రవితేజ ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టం మామూలు కష్టం కాదు.సైడ్ క్యారెక్టర్లతో కెరీర్ ను మొదలుపెట్టిన రవితేజ త్వరలో పాన్ ఇండియా హీరోలలో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు.
మరో ఐదు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ సెకండ్ హీరోగా నటించారు.
అన్నయ్య సినిమాలో చిరంజీవి రవితేజ కలిసి నటించగా ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది.
వాల్తేరు వీరయ్య విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రవితేజ, బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలాసార్లు పోటీ పడగా మెజారిటీ సందర్భాల్లో రవితేజ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.
మరోవైపు రవితేజ ఫ్యామిలీ మీడియాకు పూర్తిస్థాయిలో దూరంగా ఉంటుంది.
రవితేజ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు కూడా అభిమానులకు ఎక్కువగా తెలియవు.
రవితేజ కొడుకుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.రవితేజకు కుందనపు బొమ్మలాంటి కూతురు ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
రవితేజ కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రవితేజ కూతురు పేరు మోక్షధ అని సమాచారం.రవితేజ కూతురు సినిమాల్లోకి ఎప్పుడు వస్తారో చూడాల్సి ఉంది.ధమాకా సక్సెస్ తో రవితేజ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రవితేజ ప్రస్తుతం రావణాసుర సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలతో కూడా మాస్ మహారాజ్ భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది.







