జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న హైపర్ ఆది ఇటీవల వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ హీరో గా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం లో రూపొందిన సార్ సినిమా లో హైపర్ ఆది కీలక పాత్ర లో నటించాడు.
ధనుష్ కి అత్యంత సన్నిహితుడిగా ఉండే పాత్ర లో హైపర్ ఆది నటించడం తో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడు.ఆ మధ్య ధనుష్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన సమయం లో హైపర్ ఆది యొక్క క్రేజ్ ఏంటో తెలుసుకున్నాడు.
తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది గురించి ధనుష్ ప్రత్యేకంగా మాట్లాడాడు.ఇతనికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు అంటూ జనాల నుండి వస్తున్న స్పందన చూసి ఆశ్చర్యపోతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.

సినిమాలు తక్కువనే చేసిన కూడా ఈ స్థాయి క్రేజ్ ఎందుకు వచ్చింది అనేది అర్థం కావడం లేదని హైపర్ ఆది పై ధనుష్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే దర్శకుడు త్రివిక్రమ్ స్పందిస్తూ అతడు ఒక బుల్లి తెర పాపులర్ కామెడీ షో లో చాలా కాలంగా చేస్తున్నాడు.నటుడిగా, రైటర్ గా అద్భుతమైన కామెడీని పండించే వ్యక్తి .అందుకే ప్రేక్షకుల్లో హైపర్ ఆది కి మంచి క్రేజ్ ఉందని ధనుష్ కి త్రివిక్రమ్ చెప్పాడు.దాంతో జబర్దస్త్ కార్యక్రమాన్ని తప్పకుండా చూస్తాను అంటూ ధనుష్ చెప్పాడు.

హైపర్ ఆది అంటే ప్రత్యేకమైన అభిమానం ధనుష్ కి ఏర్పడింది.అందుకే ఏకంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని చూస్తానంటూ స్టేజ్ పై అందరి ముందు ధనుష్ చెప్పుకొచ్చాడు.ధనుష్ మాటలతో హైపర్ ఆది యొక్క స్థాయి అమాంతం జరిగింది.ముందు ముందు టాలీవుడ్ లో హైపర్ ఆది మరింత బిజీ అయ్యే అవకాశాలున్నాయి.







